New Super fast Railway Lines between Telugu States: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. మరో కీలక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మరింత పెద్దపీట వేసింది. రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.
తెలంగాణలోని శంషాబాద్ నుంచి విశాఖపట్నం-విజయవాడ మధ్య ఒకటి.. విశాఖపట్నం - విజయవాడ-కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ రానుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ రెండు మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని సర్వే ద్వారా నిర్ణయించనున్నారు. సర్వే కంప్లీట్ అయిన తరువాత ప్రాజెక్టుపై ప్రారంభం కానుంది.
ఈ రెండు మార్గాల్లో రైల్వే లైన్‌కు సంబంధించి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కలిశారు. రైల్వే ప్రాజెక్ట్‌కు సంబంధించి లేఖలు అందజేశారు. ఈ సూపర్‌ఫాస్ట్ రైల్వేలైన్ ప్రాధాన్యతను వివరిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. స్పందించిన రైల్వే బోర్డు తాజాగా.. ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం గుడ్‌న్యూస్ అందించింది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే చేయనున్నారు. ఈ సర్వేను ఆరు నెలల్లో కంప్లీట్ చేసి అందజేయనున్నారు.
Also Read: CM Jagan Mohan Reddy: రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేశాయి
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించడంతోపాటు.. రైల్వే స్టేషన్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్లలో వైఫైలు, రూ.30 వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను రెండు రాష్ట్రాలకు అందించిందని గుర్తు చేశారు.
మరోవైపు తాజాగా మంజూరు చేసిన రెండు రైల్వే లైన్లకు అందనంగా అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ, ఓవర్‌హాలింగ్ కేంద్రాన్ని, MMTS (సెకెండ్ ఫేజ్), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్రం చేపట్టింది. ఇవన్నీ పూర్తయితే ప్రజలకు మరింత సేవలు అందనున్నాయి.
Also Read: LPG Cylinder Price Cut: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. గ్యాస్ రేటు తగ్గింపు.. ఆ ధరలు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి