SP Chief Akhilesh Yadav | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ శనివారం ప్రారంభమైంది. ఇంకా కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ (Coronavirus Vaccine) పై రాజకీయాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న వ్యాక్సిన్‌ను తాను విశ్వసించనని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడైతే తానేమీ కోవిడ్ టీకాను తీసుకోనని అఖిలేశ్ (Akhilesh Yadav) స్పష్టంచేశారు. బీజేపీ ఇస్తున్న వ్యాక్సిన్‌ను తాను విశ్వసించనని.. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ను అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
I am not going to get vaccinated for now. How can I trust BJP's vaccine, when our government will be formed everyone will get free vaccine. We cannot take BJP's vaccine: Samajwadi Party chief Akhilesh Yadav#COVID19 pic.twitter.com/qnmGENzUBH
— ANI UP (@ANINewsUP) January 2, 2021
దీంతోపాటు రైతుల ఆందోళనలో గుండెపోటుతో ఈ రోజు మరణించిన రైతుపై కూడా అఖిలేశ్ స్పందించారు. బీజేపీ (BJP) కి ఏమాత్రం జాలి లేదని అర్థమైపోతోందని అఖిలేశ్ ట్వీట్ చేశారు. కొత్త ఏడాది ప్రారంభమైన తొలి వారంలోనే ఓ రైతు అమరుడయ్యాడు. తీవ్రమైన చలికి, పొగమంచుకు తట్టుకోలేక ప్రాణాలను వదిలాడు. అయినా అధికార పక్షానికి బాధలేదు. ఇంతటి కఠినత్వం బీజేపీలో ఎన్నడూ చూడలేదంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు. Also Read: Vaccine Dry Run: దేశమంతటా ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రై రన్
नव वर्ष के पहले दिन ही किसान आंदोलन में ग़ाज़ीपुर बार्डर पर एक किसान की शहादत की ख़बर विचलित करनेवाली है। घने कोहरे व ठंड में किसान लगातार अपने जीवन का बलिदान कर रहे हैं लेकिन सत्ताधारी हृदयहीन बने बैठे हैं।
भाजपा जैसा सत्ता का इतना दंभ व इतनी निष्ठुरता अब तक कभी नहीं देखी गयी।
— Akhilesh Yadav (@yadavakhilesh) January 2, 2021
ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ (Harsh Vardhan) మొదటి దశలో దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచితంగా కరోనావైరస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందులో కొటి మంది ఆరోగ్య కార్యకర్తలు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ సిబ్బంది ఉంటారని వెల్లడించారు. Also read: Sourav Ganguly: దాదాకు గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook