త్వరలోనే రాజకీయ పార్టీ స్థాపించబోతున్న తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ జమిలీ ఎన్నికలపై స్పందించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై తాను సానుకూలంగా ఉన్నట్లు రజినీ ప్రకటించారు. 'ఒకదేశం-ఒకేసారి ఎన్నిక ప్రతిపాదనకు నేను మద్దతిస్తాను. ఇలా చేయడం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతాయి' అని రజినీ అన్నారు. 'ఒకదేశం ఒకేసారి ఎన్నిక' మంచి ఆలోచనగా చెప్పారు. త్వరలో స్థాపించబోయే పార్టీలో సభ్యుత్వ నమోదు కోసం రజినీకాంత్ ఈ ఏడాది మొదట్లో రజినీకాంత్ మక్కల్ మాండ్రమ్ (ఆర్ఎంఎం)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
I support One Nation One Election. This will save money and time: Rajinikanth in Chennai #TamilNadu pic.twitter.com/kQw516MfSK
— ANI (@ANI) July 15, 2018
కాగా అంతకుముందు స్కూలు పరిసరాల్లో దొరికిన రూ.50వేలను పోలీసులకు అప్పగించిన చిన్నారి మహ్మద్ యాసిన్‌ను రజినీ అభినందించారు. ఆ చిన్నారి చదువు బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోందనే సంగతి తెలిసిందే! ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ప్రకటించాయి. 'జమిలీ' ఎన్నికలకు అన్నాడీఎంకే, టీఆర్ఎస్, జేడీయూ, వైకాపా వంటి పార్టీలు సానుకూలంగా స్పందించగా, డీఎంకే, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు వ్యతిరేకించాయి.