Independence Day 2023: దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజు 1947 ఆగస్టు 15. ఈ రేజున కూడా మహాత్మా గాంధీ నిరాహర దీక్షకు దిగారు. రోజంతా దీక్షలో ఉన్నారు. అదేంటి దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజున గాందీ నిరాహార దీక్షలో ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా..కానీ ఇదే నిజం. గాంధీజీ ఎందుకా దీక్ష చేశారు, కారణాలేంటనేది తెలుసుకుందాం..
ఇండిపెండెన్స్ డే 2023 సమీపిస్తోంది. మువ్వన్నెల జెండా ఊరూరా ఎగరనుంది. వాడవాడలా, వీధి వీధిలో జెండా వందనోత్సవాలు జరగనున్నాయి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అనే వాక్యాలకు వ్యతిరేకంగా భారతదేశ స్వాంతంత్య్రోద్యమం అంతా రక్తపాతం లేకుండా పూర్తి అహింసాయుత మార్గంలో సాధించిన మహనీయుడు గాంధీజీ. జాతిపితగా దేశం మొత్తం పిల్చుకుంటున్న మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని తెలుసుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మహాత్మా గాంధీ పుట్టింది, మరణించింది శుక్రవారం నాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కూడా శుక్రవారమే. గాంధీజీకు మహత్మా బిరుదుని ఇచ్చింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఓ సందర్భంలో ఠాగుర్‌ని కలిసిన గాంధీజీ నమస్తే గురుదేవ్ అంటూ సంబోధించారు. దీనికి బదులుగా ఆ విశ్వకని..నేను గురుదేవ్ అయితే మీరు మహాత్ముడు అని పిలిచారు. గాంధీజీ వస్త్ర త్యాగం చేసింది 1921లో. అప్పట్నించి కేవలం ధోతీతోనే జీవితం సాగించారు. 1944లో గాందీని జాతిపితగా తొలిసారి సంబోధించింది సుభాష్ చంద్రబోస్ కావడం విశేం. 1947లో సరోజిని నాయుడు కూడా ఇదే మాట ప్రస్తావించారు. ఆ తరువాత మహాత్ముడికి అధికారికంగా భారతదేశ జాతిపితగా పేరు స్థిరపడింది. భారతదేశ కరెన్సీపై ఉండే గాందీ బొమ్మ నిజమైన ఫోటోనే. ఎవరో గీసింది కాదు. 1946లో అప్పటి రాష్ట్రపతి భవన్‌లో ఓ వ్యక్తి తీసిన ఫోటో అట అది.
1930లో టైమ్స్ మేగజీన్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో మహాత్మా గాంధీని సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు గాంధీ. ఆయన చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి ఈ అవార్డు లభించింది. ఇక ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి గాంధీజీ 1948లో నామినేట్ అయినా..అదే ఏడాది ఆయన హత్య జరగడంతో ఆ ఏడాది అసలు బహుమతినే ఎవరికీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ అవార్డుకు అర్హులెవరూ జీవించిలేరంటూ నోబెల్ బహుమతి కమిటీ ప్రకటించింది.
ఇంతకీ గాంధీజీ నిరాహార దీక్ష ఎందుకు చేశారు
1947 ఆగస్టు 15న దేశానికి స్వాంతంత్య్రం లభించింది. 200 ఏళ్ల బ్రిటీషు దాశ్య శృంఖలాల్ని తెంచుకుని దేశం స్వేచ్ఛా వాయవుల్ని పీల్చుకున్న వేళ. దేశమంతా స్వాంతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్నారు. మువ్వన్నెల జెండా ఎగురవేస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. కానీ దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన అహింసావాది, జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం కోల్‌కతాలో నిరాహార దీక్షలో కూర్చున్నారు. భారత-పాకిస్థాన్ దేశాల విభజనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమిది. రెండు దేశాలగా విడిపోవడం ఇష్టం లేని గాంధీజీ తన నిరసనను ఆరోజు అలా దీక్ష ద్వారా తెలిపారు.
Also read: Gold Smuggling: భారీగా బంగారం అక్రమ రవాణా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 8 కిలోలు పట్టివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook