India Corona Cases Today: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో రెండు లక్షలకు చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. 1,94,720 మంది కొత్తగా కరోనా బారిన పడగా.. 442 మంది కొవిడ్ మహమ్మారి ధాటికి మరణించారు.
మరోవైపు 60,405 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం ఒక్కరోజే 15.8 శాతం ఎక్కువగా అనగా.. 26,657 కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,60,70,510 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 484,655 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,46,30,536 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Compared to yesterday, the total number of fresh COVID cases is up by 26,657 (15.8%) today.
India had reported 1,68,063 cases yesterday.
— ANI (@ANI) January 12, 2022
ఇండియా ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రపంచంలో పెరిగిన కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 27,84,684 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,39,57,500 దాటింది. మరో 8,167 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 55,21,071కి చేరింది.
Also Read: Delhi New Rules: ఢిల్లీలో ఇక నుంచి ప్రైవేటు ఆఫీసులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి
Also Read: Tihar Jail Corona: తిహార్ జైల్లో కరోనా కలకలం... 76 మందికి పాజిటివ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook