India Corona Update: కరోనా మహమ్మారి దేశంలో తగ్గుముఖం పట్టింది. కరోనా థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచి ఉన్నా..ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఇండియాలో 40 వేలకు దిగువలో కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా వైరస్ కేసులు 40 వేలకు దిగువలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 38 వేల 164 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 11 లక్షల 44 వేల 229కు చేరుకుంది. గత 24 గంటల్లో దేశంలో 499 మంది మరణించారు. ఇప్పటి వరకూ 4 లక్షల 14 వేలమంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4 కోట్ల 21 వేల 665 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి ఇప్పటి వరకూ 3 కోట్ల 3 లక్షల 8 వేల 456 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 40.64 కోట్లమందికి వ్యాక్సినేషన్ జరిగింది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే కరోనా థర్ద్‌వేవ్ త్వరలో వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైపోయిందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది.
Also read: Mumbai Heavy Rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు, 30 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook