Covid cases in India: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, క్రియాశీల కేసుల సంఖ్య ఊరటనిస్తోంది. రికవరీ రేటు 98 శాతానికి పెరగటం సానుకూలాంశం. ఆదివారం 10,35,797 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,132 మందికి వైరస్(Covid cases in India) పాజిటివ్‌గా తేలింది. అలాగే నిన్న 21,563 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా.. రికవరీలు 3.32 కోట్లు(98 శాతం)గా ఉన్నాయి. నిన్న నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తక్కువగా ఉండటం గమనార్హం.
Also read: India-China Talks: ఆ ప్రాంతాల్నించి చైనా వెనక్కి వెళ్లాల్సిందే
కొత్త కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం 2,27,347 మంది కరోనా(Covid-19)తో బాధపడుతున్నారు. ఆ కేసుల రేటు 0.67 శాతానికి చేరింది. మరోపక్క మరణాలు కూడా 200 దిగువన నమోదయ్యాయి. నిన్న 193 మంది ప్రాణాలు(Corona deaths) కోల్పోయారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,50,782కి చేరింది. ఇక నిన్న 46,57,679 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 95 కోట్ల మార్కును దాటింది. దసరా లోపు 100 కోట్ల మార్కుకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 3,01,587 మందికి కరోనా (Corona update) పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి 4,595 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,86,32,258కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,67,010కి పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook