Rs 11440 Crore Revival Package For Vizag Steel Plant: ప్రైవేటీకరణ జరుగుతుందని.. మూతపడుతుందని వైజాగ్ స్టీల్‌పై తీవ్ర చర్చ జరగ్గా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీతో వైజాగ్ స్టీల్‌కు పూర్వ వైభవం రానుంది.
Pawan Kalyan comments on YS Jagan: అన్యాయాన్ని అరికట్టడానికే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన ఆశయం ఓడిపోలేదు. ఉత్తరాంధ్ర నుండే తాను పోరాటం నేర్చుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో జనసేన జండా గాజువాకలో ఎగురుతుంది అని ధీమా వ్యక్తంచేశారు.
KTR About Vizag Steel Plant Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా.. కేంద్రం కుట్రలు చేసిన తీరుపైన భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ నిరంతరం ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటుందన్నారు.
Harish Rao On Visakhapatnam Steel Plant: విశాఖ పరిశ్రమ విషయంలో వైసీపీ, టీడీపీ నోరుమూసుకున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు, బీఆర్ఎస్ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు. ఏపీ ప్రజలకు, కార్మికులకు అభినందనలు తెలిపారు.
Thota Chandrasekhar Press Meet : ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎగిరిపోతాయి. జాతి సంపదను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం మొండివైఖరితో ప్రైవేటీకరణ చేసినా.. మళ్ళీ దాన్ని కాపాడుకొని, జాతీయం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు అని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ గుర్తుచేశారు.
Ganta Srinivas Rao : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తన రాజీనామా ఆమోదం కోసం కోర్టుకు వెళ్లబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా ... దాని ఆమోదం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తన రాజీనామా ఆమోదం పొందేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
Pawan Kalyan Deeksha: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆదివారం (డిసెంబర్ 12) సంఘీభావ దీక్ష చేపట్టారు.
Vizag Steel Plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తోంది.
Vizag Steel Plant: ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కు నినాదంతో ప్రారంభమైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఇప్పుడు ప్రాణవాయువు అందిస్తోంది. లాభసాటిగా లేదు..ప్రైవేటుపరం చేద్దామనుకున్న పరిశ్రమే ఇప్పుుడు ప్రాణవాయుువు సరఫరా చేస్తోంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నుంచి నిరంతరాయంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది.
Vizag steel plant వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌ని వ్యతిరేకిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దేశమంతా ఆక్సీజన్ లభించక కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్న ప్రస్తుత తరుణంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిత్యం 100 టన్నుల మెడికల్ ఆక్సీజన్‌ని (Oxygen crisis) ఉత్పత్తి చేస్తోందని విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు.
Ysrcp walkout: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజ్యసభలో మరోసారి చర్చకొచ్చింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
దాదాపు గత నెలరోజులుగా ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ఎన్జీవోలు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియకుండా అడ్డుకుంటామని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. రోజురోజుకూ మద్దతు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Chiru on vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. పోరాటానికి మద్దతు పలికారు.
Ap Government: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. స్టీల్‌ప్లాంట్ అంశంపై ప్రధానికి జగన్ మరోసారి లేఖ రాసి..పునరుద్ధరణకు సూచనలు చేసినట్టు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Vizag steel plant: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సమస్యను విన్నవించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్ర మోదీ అప్పాయింట్మెంట్ కోరారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.