YS Sharmila: చేతకాని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే నుంచి బయటకు రావాలి.. వైఎస్‌ షర్మిల సంచలన డిమాండ్‌

YS Sharmila Slams Modi Chandrababu Pawan Kalyan On Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై వైఎస్‌ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. చేతకాకపోతే ఎన్డీయే నుంచి బయటకు రావాలని సంచలన డిమాండ్‌ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 26, 2024, 04:26 PM IST
YS Sharmila: చేతకాని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే నుంచి బయటకు రావాలి.. వైఎస్‌ షర్మిల సంచలన డిమాండ్‌

Vizag Steel Plant: విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన నరేంద్ర మోదీ లక్ష్యంగా వైఎస్‌ షర్మిల విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వైఖరిని తప్పుబట్టారు. మోదీ చెప్పేవన్నీ అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేనని చెప్పారు.

Also Read: YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. 'జమిలి వస్తుంది మీ జగన్ గెలుస్తున్నాడు!'

విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 'కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ నరేంద్ర మోదీకి ఆంధ్రుల హక్కు మీద లేదు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయి. మోడీ తన దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా ప్లాంట్‌ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉంది' అని వివరించారు.

Also Read: Kadapa Mayor: మళ్లీ మేయర్ వర్సెస్‌ టీడీపీ ఎమ్మెల్యే మధ్య రచ్చరచ్చ.. 'కడప'లో కుర్చీల లొల్లి

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కి రూ.15 వేల కోట్ల సహాయం అందించి బతికించారు. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన  కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్‌ను ఆదుకోవడానికి మనసు లేదు' అని విమర్శించారు. ఇద్దరు ఎంపీలు ఉండే జేడీఎస్‌కు రూ.15 వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే.. ఎన్డీయేకు ఊపిరి పోసిన టీడీపీ- జనసేన పార్టీలు మాత్రం మోదీకి సలాం కొడుతున్నాయి. కానీ నిధులు రాబట్టడం లేదు. 18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు. మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనం' అని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.

'జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ముడిసరుకు కొరతతో ఉత్పత్తి తగ్గింది. ప్లాంట్ దివాలా తీసే స్థాయిలో ఉందని.. తమ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవాలని కార్మికులు 1,400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఉల్టా మోడీతో మిట్టల్ స్టీల్ గురించి చర్చ చేస్తున్నారు. మిట్టల్ పెట్టబోయే ప్లాంట్‌కి ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడలట. ఇదెక్కడి న్యాయం?' అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

'వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు చెల్లించాలి. ప్లాంట్‌ను వెంటనే సెయిల్‌లో విలీనం చేయాలి' అని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ప్లాంట్‌లో 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. భవిష్యత్‌లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి  సామర్థ్యం పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇవి సాధించడం చేతకాకపోతే వెంటనే ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ, జనసేనలు తప్పుకోవాలని వైఎస్‌ షర్మిల సంచలన డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News