Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఇకపై లోయర్ బెర్త్‌లు ఆ ప్రయాణీకులకే

Indian Railways: ప్రయాణీకుల సౌకర్యార్ధం ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త నియమాలు ప్రవేశపెడుతుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ తీసుకున్న ఆ నిర్ణయం గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2023, 04:05 PM IST
Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఇకపై లోయర్ బెర్త్‌లు ఆ ప్రయాణీకులకే

Indian Railways: భారతీయ రైల్వే కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో లోయర్ బెర్త్‌ను వికలాంగులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వికలాంగుల సౌకర్యార్ధం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం..

రోజూ లక్షలాదిమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. నచ్చిన సీట్ల కోసం నెల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటుంటారు. రైళ్లలో చాలామంది సహజంగా లోయర్ లేదా సైడ్ లోయర్ బెర్త్ ఆప్షన్ ఎంచుకుంటుంటారు. కానీ ఇకపై అలా జరగకపోవచ్చు. ఇండియన్ రైల్వేస్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ కొత్త ఆదేశాల ప్రకారం రైళ్లలో లోయర్ బెర్త్ కేవలం కొంతమందికే కేటాయించనున్నారు. ఆ కేటగరీలో ఎవరుంటారో పరిశీలిద్దాం..రైళ్లలో లోయర్ బెర్త్ లేదా సైడ్ లోయర్ బెర్త్ అనేది కేవలం వికలాంగులకే వర్తించనుంది. 

రైల్వే బోర్డ్ ఆదేశాల ప్రకారం నాలుగు సీట్లు అంటే రెండు లోయర్, రెండు మిడిల్ సీట్లు, ఏసీ థర్డ్ క్లాస్‌లో రెండు, స్లీపర్ తరగతిలో రెండు సీట్లను వికలాంగులకు కేటాయించారు. అదే సమయంలో గరీబ్ రథ్ రైలులో రెండు లోయర్, రెండు అప్పర్ సీట్లను వికలాంగులకు కేటాయించారు. 

దీంతోపాటు సీనియర్ సిటిజన్లకు కూడా లోయర్ బెర్త్ కేటాయించనున్నారు. స్లీపర్ తరగతిలో 6-7 లోయర్ బెర్త్‌లు, థర్డ్ ఏసీలో 4-5 లోయర్ బెర్త్‌లు, సెకండ్ ఏసీలో 3-4 లోయర్ బెర్త్‌లు గర్భిణీ మహిళలకు, 45 ఏళ్లు పైబడినవారికి కేటాయిస్తారు. ఏ విధమైన ఆప్షన్ లేకుండానే వారికి ఈ సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు టికెట్ ఒకవేళ సీనియర్ సిటిజన్, గర్బిణీ లేదా దివ్యాంగులు అప్పర్ సీట్‌లో ఉంటే టీటీ వారికి లోయర్ బెర్త్ కేటాయించవచ్చు.

Also read: Annual Recharge Plans: ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియాల వార్షిక ప్లాన్స్ ఇలా ఉన్నాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News