Indian Vice Presidential Election-2022: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 6న పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ జరుగుతుంది. వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తారు. జూలై 5న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ రానుందని ఎన్నికల అధికారులు తెలిపారు. జూలై 19 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూలై 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆగస్టు 6న ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.
ఉప రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 543 మంది లోక్‌సభ సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులతోపాటు 12 మంది నామినేటెడ్ సభ్యులతో కలిపి మొత్తం 788 మంది ఎన్నికల్లో పాల్గొంటారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈసారి ఉప రాష్ట్రపతి ఎన్నికలో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ ప్రతిపక్షాలన్నీ ఏకకానున్నట్లు తెలుస్తోంది.
అధికార, విపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలో దింపే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓబీసీ, జనరల్ కేటగిరికి చెందిన మహిళను బరిలోకి దింపే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి కూడా దక్షిణాదికి చెందిన వారికే అవకాశం ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉపరాష్ట్రపతిగా మహిళలు పనిచేయలేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వ చరిత్రను తిరగరాస్తుందన్న వాదన ఉంది.
Also read: Viral Video: కనువిందు చేస్తున్న కుక్కల ప్లేయింగ్..ఫిదా అవుతున్న నెటిజన్లు..!
Also read: మీనా ఇంటి వద్ద రజినీకాంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి