/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Omicron cases in India: దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ కేసులు మరింత పెరగుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో తాజాగా (ఆదివారం) ఒమిక్రాన్ కొత్త కేసులు బయటపడ్డాయి. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి (India Omicron cases) చేరువైంది.

ఆ రాష్ట్రాల్లో తొలి కేసులు..

ఒమిక్రాన్ వేరియంట్ కొత్తగా మరో రెండు రాష్ట్రాలకు వ్యాపించింది. హిమాచల్ ప్రదేశ్​, మధ్య ప్రదేశ్​లలో తొలి కేసులు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్​లో ఒక కేసు (కెనడా నుంచి వచ్చిన మహిళ) నమోదవగా.. మధ్యప్రదేశ్​లో ఏకంగా 8 కేసులు వెలుగు (Omicron new Cases) చూశాయి.

మధ్యప్రదేశ్​లో నమోదైన 8 ఒమిక్రాన్ కేసుల్లో ఇప్పటికే 6 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మగితా ఇద్దరు ఐసోలేషన్​లో చికిత్స (Omicron cases in MP) పొందుతున్నట్లు తెలిపింది.

ఏపీలో మరో రెండు కేసులు..

ఆంధ్రప్రదేశ్​లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఆ ఇద్దరూ ఇతర దేశాల నుంచి వచ్చినట్లుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఈ కేసులు (Omicron cases in AP) బయటపడ్డాయి.

ఒక్క రోజే నాలుగు కేసులు..

ఒడిశాలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వారంతా వేరే దేశాల నుంచి ఇటీవలే రాష్ట్రానికి వచ్చినట్లు ఒడిశా ఆరోగ్య విభాగం వెల్లడించింది. నలుగురిలో ఇద్దరు నైజీరియా నుంచి రాగా.. మిగతా ఇద్దరు యూఏఈ నుచి వచ్చినట్లు తెలిపింది.

పశ్చిమ్​ బెంగాల్​లో కూడా ఒక్క రోజే నాలుగు ఒమిక్రాన్​ కేసులు (Omicron news) వచ్చాయి. వారంతా యూకే నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కోల్​కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్ టెస్టులు తప్పనిసరి చేయగా.. అక్కడ అంతర్జాతీయ ప్రయాణికుకు అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో పాజిటివ్​గా తేలితే.. ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్​కు పంపుతున్నారు. ఇలా పంపిన శాంపిళ్లలోనే తాజాగా 4 కేసులు బయటపడ్డట్లు వివరించారు స్థానిక అధికారులు.

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఇలా..

ఇవాళ ఉదయం కరోనా బులిటెన్​ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య విభాగం.. దేశంలో 422 ఒమిక్రాన్​ కేసులు ఉన్నట్లు తెలిపింది. అందులో ఎక్కువ మొత్తం మహారాష్ట్రలోనే ఉన్నట్లు వెల్లడిచింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డట్లు వివరించింది. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్​, మధ్య ప్రదేశ్​లలో కేసులు నమోదైన నేపథ్యంలో.. ఒమిక్రాన్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 19కి పెరిగింది.

Also read: Vaccination for 15-18 years: జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయసు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ : ప్రధాని నరేంద్ర మోదీ

Also read: Corona cases in India: దేశంలో కొత్తగా 6,987 కరోనా కేసులు, 162 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
India's Omicron Tally Nears 450 Mark, 5 States See Fresh Spike in New Cases
News Source: 
Home Title: 

Omicron cases in India: దేశంలో మరో రెండు రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి!

Omicron cases in India: మరో రెండు రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి- 450కి చేరువలో మొత్తం కేసులు!
Caption: 
India's Omicron Tally Nears 450 Mark, 5 States See Fresh Spike in New Cases (representative image))
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ ఆందోళనలు

మరో రెండో రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదు

మధ్య ప్రదేశ్​లో 8 కేసులు గుర్తింపు

Mobile Title: 
Omicron cases in India: దేశంలో మరో రెండు రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి!
ZH Telugu Desk
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, December 26, 2021 - 17:54
Request Count: 
54
Is Breaking News: 
No