JEE Mains Exams 2025: ఎన్ఐటీ, ఐఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 14 లక్షలమంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నెలాఖరు వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి.
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. జనవరి 30 బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్లకై పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 1.50 లక్షలమంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ మొదటి సెషన్ పరీక్షలు జరిగితే మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఏపీ, తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఏప్రిల్ నెలలో జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు జరుగుతాయి. మే 18న అడ్వాన్స్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్స్‌లో కనీస అర్హత సాధిస్తేనే జేఈఈ అడ్వాన్స్ రాసేందుకు వీలుంటుంది.
దేశవ్యాప్తంగా 31 ఎన్ఐటీలలో మొత్తం 24 వేలు సీట్లుంటే 23 ఐఐటీల్లో కలిపి 17,600 సీట్లున్నాయి ఇక ట్రిపుల్ ఐటీల్లో 8500 సీట్లున్నాయి. ఇతర విద్యాసంస్థల్లో 5 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా విద్యార్ధులకు కొన్ని సూచనలు జారీ అయ్యాయి.
జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు ఫోటో ఐడీ కార్డులో భాగంగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్,రేషన్ కార్డులో ఏదో ఒకటి తీసుకెళ్లవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులో అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకెళ్లాలి. దివ్యాంగ విద్యార్ధులయితే వెంట మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. జామెట్రీ బాక్స్, బ్యాగ్, పర్సు, ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్, కాలిక్యులేటర్ వంటివి తీసుకెళ్లకూడదు. నగలు, మెటాలిక్ వస్తువులు ధరించకూడదు.
Also read: Group 1 Mains Schedule: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల, మే 3 నుంచి పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి