రాజకీయ కలకలం రేపిన ఆర్చ్‌బిషప్ లేఖ

దేశంలో అనిశ్చిత రాజకీయ వాతావరణం ఉందని.. ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయంటూ ఢిల్లీ ఆర్చ్‌బిషప్‌ లేఖ రాయడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.

Last Updated : May 22, 2018, 12:00 PM IST
రాజకీయ కలకలం రేపిన ఆర్చ్‌బిషప్ లేఖ

దేశంలో అనిశ్చిత రాజకీయ వాతావరణం ఉందని.. ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయంటూ ఢిల్లీ ఆర్చ్‌బిషప్‌ లేఖ రాయడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ‘దేశం కోసం’ ప్రార్థించాలని, ఉపవాసాలు ఉండాలని లేఖలో రాశారు.

'దేశం కోసం’ ప్రార్థన చేయాలని, వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని, ఆదివారం సామూహిక ప్రార్థనల్లో లేఖలో పేర్కొన్న ప్రార్థనను తప్పకుండా చదివి వినించాలని ఆర్చ్‌బిషప్‌ అనిల్‌ కౌటో తన లేఖలో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం కల్లోల రాజకీయ వాతావరణాన్ని చూస్తున్నాం. ఇది మన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామిక విలువలు, లౌకిక నిర్మాణానికి ముప్పుగా పరిణమిస్తోంది’ అని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని, నేతల్లో స్వచ్ఛమైన దేశభక్తి ఎగిసిపడేలా చూడాలని ప్రభువును వేడుకుంటూ ప్రార్థన చేయాలని అన్నారు.

ఈ లేఖను బీజేపీ తప్పుబట్టింది. కులం, మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టాలనుకోవడం సరికాదని మీకు మీరే లౌకికవాదిగా అభివర్ణించుకోవడం దురదృష్టకరమని బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సీ అన్నారు. ప్రధాని మోదీ దేశ సమ్మిళిత అభివృద్ధి కృషి చేస్తున్నారని, ఏ ఒక్క వర్గంపైనా కేంద్రం వివక్ష వహించడం లేదని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఇది భారతీయ లౌకికవాదం, ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడిగా ఆర్ఎస్ఎస్ నేత రాకేశ్ సిన్హా పేర్కొన్నారు.

ఆర్చ్‌బిషప్ లేఖలో ఎలాంటి రాజకీయ ప్రేరేపణ లేదని, ఇది ప్రభుత్వానికి, ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా ఉందనడం వాస్తవం కాదని ఆర్చ్‌బిషప్ కార్యాలయం పేర్కొంది. 'తప్పుడు సమాచారం వ్యాపించకూడదు. ఇది కేవలం ప్రార్ధనలకు ఆహ్వానం. ఇటువంటి లేఖలు గతంలో అనేకం వచ్చాయి" అని రాబిన్సన్, ఢిల్లీ ఆర్చ్ బిషప్ కార్యదర్శి అన్నారు.

 

Trending News