Maharashtra Gondia Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోందియా జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 53 మంది గాయపడ్డారు. వీరిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటాక 2.30గం. సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.
నాగ్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న భగత్ కి కోటి ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్ వెళ్తున్న ఈ రెండు రైళ్లు సిగ్నల్ సమస్య కారణంగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాదంలో భగత్ కి కోటి ఎక్స్‌ప్రెస్‌కి చెందిన మూడు భోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 53 మంది గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో కొందరిని గోందియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. సాంకేతిక లోపం కారణంగానే సిగ్నల్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Maharashtra | More than 50 persons were injured after 3 bogies of a train derailed in Gondia around 2.30 am at night. A collision b/w a goods train & passenger train- Bhagat ki Kothi, due to non-receipt of signal, led to this accident. No deaths were reported.
— ANI (@ANI) August 17, 2022
Also Read: MLA Warning: కాళ్లు విరగ్గొట్టండి.. నేను చూసుకుంటా! కార్యకర్తలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook