PM Narendra Modi Record: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరో రికార్డు..

PM Narendra Modi Record: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో రికార్డు క్రియేట్ చేశారు. అవును ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో 10 యేళ్ల ఐదు రోజులు అవుతోంది. ఈ సందర్భంగా దేశంలో ఎక్కువ రోజులు ప్రధాన మంత్రి బాధ్యతలో ఉన్న మూడో వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 31, 2024, 11:02 AM IST
PM Narendra Modi Record: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరో రికార్డు..

PM Narendra Modi Record: భారత దేశ ప్రధాన మంత్రిగా 26 మే 2014లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రైమ్ మినిస్టర్‌గా 10 సంవత్సరాల 5 రోజులు పూర్తి చేసుకొని అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా ఆ బాధ్యతలు నిర్వహిస్తోన్న వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్డు క్రియేట్ చేసారు. ఈయన కంటే ముందు మన్మోహన్ సింగ్.. దేశ ప్రధాన మంత్రిగా 10 సంవత్సరాల 4 రోజులు ఆ పదవిలో ఉన్నారు. తాజాగా అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా ఉన్న మూడో వ్యక్తిగా ఉన్న మన్మోహన్ సింగ్ రికార్డును నరేంద్ర మోదీ క్రాస్ చేసారు. మన దేశంలో తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ.. 1947 ఆగష్టు 15 నుంచి 27 మే 1964 వరకు మొత్తంగా 16 సంవత్సరాల 286 రోజులు ఆ పదవిలో ఉన్నారు.

ఆయన తర్వాత ఆయన కుమార్తె ఇందిరా గాంధీ.. తొలిసారి 24 జనవరి 1966 నుంచి 24 మార్చి 1977 వరకు మొత్తంగా 11 సంవత్సరాల 59 రోజులు పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 14 జనవరి 1980  నుంచి 31 అక్టోబర్ 1984 వరకు 4 సంవత్సరాల 291 రోజులు ఆ పదవిలో ఉన్నారు. మొత్తంగా కలిపితే 15 సంవత్సరాల 350 రోజులు పాటు అంటే దాదాపు 16 సంవత్సరాలు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపటి తండ్రి నెహ్రూ తర్వాత అత్యధిక కాలలం ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.

వీళ్లిద్దరి తర్వాత మన్మోహన్ సింగ్ మొన్నటి వరకు ఎక్కువ కాలం 10 సంవత్సరాలు 4 రోజులు పాటు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా ఆ పేరిట రికార్డు ఉండే. తాజాగా నరేంద్ర మోదీ నేటితో 10 యేళ్ల 5 రోజులు.. జూన్ 4న వరకు 10 యేళ్ల 9 రోజులు ఆ బాధ్యతలో వ్యక్తిగా నిలుస్తారు.అంటే దేశంలో నెహ్రూ, ఇందిరాల తర్వాత అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా కూడా నరేంద్ర మోదీ రికార్డు క్రియేట్ చేసారు.

తాజాగా జరుగుతోన్న 18వ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టడం లాంఛనమే. ఇప్పటికే విడుదలైన అన్ని సర్వేలు నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాన మంత్రి కాబోతున్నారని చెబుతున్నాయి. ఇక ఆయన ప్రాతినిథ్యం వహించే వారణాసి లోక్‌సభ స్థానంలో పాటు చివరి విడతలో 57 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఇక దేశంలోని మెజారిటీ  సర్వేలు   ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నిక అవుతారాని చెబుతున్నాయి.మరి దేవ ప్రజలు నరేంద్ర మోదీని తిరిగి ప్రధానిగా ఆయన్ని ఎన్నుకుంటారా లేదా అనేది తెలియాంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.  

Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News