శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ' హిందుస్తాన్ జిందాబాద్.. దిల్కీ అవాజ్ ' పాటను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి దీన్ని తన అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. ఈ పాటను భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లు రాజాసింగ్ పేర్కొన్నారు.
అయితే రాజాసింగ్ షేర్ చేసిన ఈ పాట ట్యూన్ తమదేనని..దీన్ని రాజాసింగ్ కాపీ కొట్టారని పాక్ ఆర్మీ ఆరోపించింది. మార్చి 23 పాకిస్తాన్ డే సందర్భంగా తాము రూపొందించిన 'పాకిస్తాన్ జిందాబాద్ ' పాటకు కాపీనని పేర్కొంది. ఈ పాటను సహిర్ అలీ బగ్గా రాసారని తెలిపింది. ఈ పాట ట్యూన్ ను కాపీ కొట్టినందుకు సంతోషమేనని..అయితే కాపీకి సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు.
Glad that you copied. But copy to speak the truth as well. #PakistanZindabad https://t.co/lVPgRbcynQ
— Asif Ghafoor (@peaceforchange) April 14, 2019