భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దీంతో భారత ఆర్మీ క్షిపణి వ్యవస్థ . . మరింత బలోపేతమైంది. బ్రహ్మోస్, అగ్ని శతఘ్నుల సరసన తాజాగా పినాకా క్షిపణి కూడా చేరింది.
90 కి.మీ లక్ష్యాలను సైతం..
ఒడిశా తీరంలో.. పినాకా మిస్సైల్ సిస్టమ్ ను భారత రక్షణ పరిశోధన సంస్థ.. DRDO విజయవంతంగా పరీక్షించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితంపై 90 కిలోమీటర్ల దూరాల లక్ష్యాలను ఛేదించగలదు. ఒడిశా తీరం నుంచి చేసిన ప్రయోగంలో నిర్దేశించిన లక్ష్యాన్ని పినాకా క్షిపణి ఛేదించింది. పినాకా.. ఒక ఫిరంగి క్షిపణి వ్యవస్థ. ఇది శత్రువులపై యుద్ధంలో భారత ఆర్మీకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ క్షిపణిని రెండుసార్లు DRDO పరిశోధకులు ప్రయోగించారు. ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో రెండుసార్లు దీన్ని పరీక్షించారు. తాజాగా ఒడిశా తీరంలో నిర్వహించిన పరీక్షల్లో ఇది విజయం సాధించింది.
#WATCH: Pinaka Missile System developed by Defence Research & Development Organisation (DRDO) was again successfully tested today off the Odisha coast. The extended range version of the missile can hit targets at 90 kms. pic.twitter.com/UnG0VU4WGe
— ANI (@ANI) December 20, 2019