శ్రీశైలం విద్యుత్ కేంద్రం ( Srisailam power plant ) లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.
శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ విద్యుత్ కేంద్రం( Srisailam left canal power plant ) లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయారు. రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సొరంగంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక చనిపోయినట్టుగా తెలుస్తోంది. జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Pm modi tweets ) స్పందించారు. శ్రీశైలం ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రదాని మోదీ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అటు గాయపడి చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Fire at the Srisailam hydroelectric plant is deeply unfortunate. My thoughts are with the bereaved families. I hope those injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) August 21, 2020
ఇప్పటికే ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ( Telangana cm kcr ) సీఐడీ విచారణకు ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు, దారి తీసిన పరిస్థితుల్ని వెలికి తీయాలని సూచించారు. Also read: Ganesh Chaturthi: వ్యక్తిగత నిమజ్జనాలకు ఓకే..ఊరేగింపులకు నో