Navjot Singh Sidhu One Year Imprisonment: పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకి గట్టి షాక్ తగిలింది. 1988 నాటి కేసులో సుప్రీం కోర్టు సిద్ధూకి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అప్పట్లో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో రోడ్డుపై గొడవపడ్డ సిద్ధూ అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గుర్నామ్ సింగ్ తలకు తీవ్ర గాయమై అతను మృతి చెందాడు. ఈ కేసులో గతంలో పంజాబ్ హైకోర్టు సిద్ధూకి మూడేళ్ల జైలు శిక్ష విధించగా.. తగిన ఆధారాలు లేవనే కారణంతో 2018లో సుప్రీం కోర్టు కేవలం రూ.1000 జరిమానాతో సరిపుచ్చింది. గుర్నామ్ కుటుంబ సభ్యులు దీనిపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా... దానిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా సిద్ధూకి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, సంజయ్ కిషన్ కౌల్‌తో కూడిన సుప్రీం బెంచ్ సిద్ధూ కేసులో తాజా తీర్పు వెలువరించింది.
డిసెంబర్ 27, 1988న సిద్ధూ గుర్నామ్ సింగ్‌తో రోడ్డుపై గొడవపడి అతనిపై దాడికి పాల్పడ్డాడు. గుర్నామ్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు సిద్ధూపై కోర్టుకెక్కారు. తగిన ఆధారాలు లేవనే కారణంతో సెప్టెంబర్ 22, 1999న పటియాలా కోర్టు సిద్ధూని నిర్దోషిగా ప్రకటించింది. ఆ తర్వాత పటియాలా కోర్టు తీర్పును గుర్నామ్ కుటుంబ సభ్యులు పంజాబ్ హైకోర్టులో సవాల్ చేశారు. 2006లో దీనిపై తీర్పు వెలువరించిన పంజాబ్ హైకోర్టు సిద్ధూని దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
సిద్ధూ పంజాబ్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై 2018లో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన బెంచ్ సిద్ధూని నిర్దోషిగా ప్రకటిస్తూ కేవలం రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై గుర్నామ్ కుటుంబ సభ్యులు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా... ఈ ఏడాది మార్చి 25న దీనిపై వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా వెలువరించిన తీర్పులో సిద్ధూకి శిక్షను ఖరారు చేసింది.
Also Read: KA Paul Comments: చంద్రబాబులా డబ్బులు పట్టుకొని పారిపోను! కేఏ పాల్ సంచలన కామెంట్లు..
Also Read: Also Read: Lenovo Tab M8 Amazon: రూ.449 ధరకే Lenovo M8 ట్యాబ్ కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook