Rahul in Night Club With Woman Fact: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సంబంధించి నైట్ క్లబ్ వీడియో సృష్టించిన దుమారం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రాహుల్ పక్కన ఉన్న మహిళ ఎవరన్న చర్చ జరిగింది. ఆమె నేపాల్ లోని చైనా దౌత్యవేత్త హౌ యాంకీ అంటూ ప్రచారం హోరెత్తడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. బీజేపీ నేతలు రాహుల్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో నేపాల్ ప్రధానిపై హనీ ట్రాప్ జరిగిందని ప్రస్తావిస్తూ.. బీజేపీ నాయకులు విమర్శలు చేశారు.
ఖాట్మాండులోని ఓ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ కనిపించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. పక్కనే ఉన్న ఓ మహిళతో రాహుల్ మాట్లాడటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. చైనా దౌత్యవేత్తను రాహుల్ రహస్యంగా కలవాల్సిన పని ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. చైనా దౌత్యవేత్తను పక్కన పెట్టుకుని ఖాట్మండు పబ్ నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ ట్వీట్ చేయడం విచారకరమని కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
అయితే ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఓ జాతీయ మీడియా సంస్థ ప్రయత్నించింది. ఇండియా టుడే పరిశీధనలో రాహుల్ పక్కన ఉన్న యువతి చైనా దౌత్యవేత్త కాదని తేలింది. ఆమె స్వదేశం చైనానే కాదు. సదరు మహిళ నేపాల్‌కు చెందిన రాబిన్ శ్రేష్ట. వధువు స్నేహితురాలు.
జర్నలిస్టు సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ ఇంటర్నేషనల్‌కు ఢిల్లీ ప్రతినిధిగా సుమ్నిమా ఉదాస్ పని చేశారు. ఢిల్లీలో గ్యాంగ్ రేప్ సహా అనేక అంశాలపై సుమ్నిమా కథనాలు రాశారు. 2001 నుంచి 2017వరకు సీఎన్‌ఎన్‌లో పనిచేశారు. 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫౌండర్‌గా కొనసాగుతున్నారు.
Also Read: LIC IPO Opens: ప్రారంభమైన జంబో ఎల్ఐసీ ఐపీఓ
Also Read: Swiggy Drone Services: స్విగ్గీ వినూత్న ప్రయోగం, ఫోన్ చేస్తే చాలు..ద్రోన్ డెలివరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook