Bank Holidays: కస్టమర్లకు బిగ్ అలర్ట్, అక్టోబర్ లో 12 రోజులు బ్యాంకు సెలవులు

October 2024 Bank Holidays: ప్రస్తుతం దాదాపు అన్ని రకాల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే నడుస్తున్నాయి. కానీ కొన్ని పనులుంటే మాత్రం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. అందుకే బ్యాంకులకు ఎప్పుడు సెలవులున్నాయో తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2024, 07:00 PM IST
Bank Holidays: కస్టమర్లకు బిగ్ అలర్ట్, అక్టోబర్ లో 12 రోజులు బ్యాంకు సెలవులు

October 2024 Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకు సెలవులు ప్రకటిస్తుంటుంది. ఇందులో ప్రాంతాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి. ఇప్పుడు రానున్న అక్టోబర్ నెల సెలవుల జాబితా విడుదల చేసింది. వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 12 సెలవులున్నాయి. ఆ సెలవులేంటో చెక్ చేద్దాం

అక్టోబర్ నెలలో ప్రధానంగా గాంధీ జయంతి, దసరా, బతుకమ్మ పండుగ,  కర్వా చౌత్, దంతేరాస్, దీపావళి పండుగలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి. రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.  అక్టోబర్ నెల సెలవుల జాబితా ఇలా ఉంది.

అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవు
అక్టోబర్ 3 నవరాత్రి వేడుకలు ప్రారంభం,  మహారాజా అగ్రసేన్ జయంతి సెలవు
అక్టోబర్ 6 ఆదివారం సెలవు
అక్టోబర్ 19 మహా సప్తమి సెలవు
అక్టోబర్ 11 మహా నవమి సెలవు
అక్టోబర్ 12 దసరా, రెండవ శనివారం సెలవు
అక్టోబర్ 13 ఆదివారం సెలవు
అక్టోబర్ 17 వాల్మీకి జయంతి సెలవు
అక్టోబర్ 20 ఆదివారం సెలవు
అక్టోబర్ 26 నాలుగవ శనివారం సెలవు
అక్టోబర్ 27 ఆదివారం సెలవు
ఆక్టోబర్ 31 దీపావళి సెలవు

Also read: 8 Seater Cars: 8 సీటర్ కారు కోసం చూస్తున్నారా మీ కోసం టాప్ 5 బెస్ట్ 8 సీటర్ కార్లు ఇవే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News