IHMCL Advisery : మీరు మీ కారులో Paytm FASTagని ఇన్‌స్టాల్ చేసి ఉంటే మీకు ఇది మంచి వార్త. FASTag వినియోగదారుల కోసం Paytm రోడ్ టోలింగ్ అథారిటీ మార్గదర్శకాలను విడుదల చేసింది. హైవేలపై ప్రయాణించే డ్రైవర్లు అధీకృత బ్యాంకుల నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని అథారిటీ సూచించింది. దీనితో పాటు, రెండు కోట్ల మందికి పైగా Paytm ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు కొత్త RFID స్టిక్కర్‌లను పొందాలని సూచించింది. ఇందుకోసం రోడ్ టోలింగ్ అథారిటీ 32 అధీకృత బ్యాంకుల జాబితాను విడుదల చేసింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పేరు ఈ లిస్ట్‌లో లేదని ఇక్కడ గమనించాలి. 2024 జనవరి 31న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన చర్యను అనుసరించి జనవరి 1 నుండి బ్యాంక్ సేవలను అందించకుండా Paytm నిషేధించబడింది.
ఇదీ చదవండి: మీరు డిగ్రీ పూర్తిచేసి బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? మీకో సువర్ణవకాశం..
2024 ఫిబ్రవరి 29 తర్వాత ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయవు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ టోలింగ్ అథారిటీ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి అధీకృత బ్యాంకుల జాబితాను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎలక్ట్రానిక్ టోలింగ్ విభాగం IHMCL అధికారిక హ్యాండిల్ ద్వారా పంచుకుంది.
EPFO క్లెయిమ్‌ల నిషేధం..
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) Paytm పేమెంట్ బ్యాంక్ EFP ఖాతాకు లింక్ చేయబడిన క్రెడిట్‌లను ఇటీవల నిషేధించాలని నిర్ణయించింది. Paytm బ్యాంక్‌పై RBI చర్య తీసుకున్న నేపథ్యంలో EPFO కూడా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: UPSC Exam 2024: UPSC సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. 1056 ఖాళీల భర్తీ..
మరోవైపు మొన్న RBI చర్య తర్వాత ED Paytm సీనియర్ అధికారులను విచారించింది ,అనేక పత్రాలను సేకరించింది. ఫిన్‌టెక్ కంపెనీలో ఆర్‌బిఐ గమనించిన అవకతవకలపై అధికారిక దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయించే ముందు కేంద్ర ఏజెన్సీ ఫెమా కింద పత్రాల ప్రాథమిక పరిశీలనను నిర్వహిస్తోంది. Paytm అధికారులు ఇటీవల కొన్ని పత్రాలను సమర్పించారని ,వారి నుండి కొన్ని ప్రశ్నలు అడిగారని వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మరికొంత సమాచారం కోరారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి