RPF Cop Saves Woman from Falling Under Train in Bengal: పశ్చిమ బంగాల్ లోని పురూలియా రైల్వే స్టేషన్ లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కదులుతోన్న రైల్లో నుంచి దిగబోయిన ఓ మహిళ రైలు కింద పడబోయింది. అది గమనించిన రైల్వే పోలీసు వేగంగా వెళ్లి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఇలాంటి పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారిపై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఏం జరిగిందంటే?
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ట్విట్టర్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. పశ్చిమ బంగాల్ లోని పురూలియా రైల్వే స్టేషన్ లో సాంత్రాగాచి-ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ ఆ స్టేషన్ ను విడిచి వెళ్లిపోతుంది. కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. దిగే ప్రయత్నంలో రైలు నుంచి దూకేశారు.
ఒక మహిళ ప్లాట్‌ఫాం మీద పడిపోయింది. మరో మహిళ మాత్రం పట్టకోల్పోవడం వల్ల ప్రమాదకర స్థితిలోకి జారిపోయింది. ఆమె తల కదులుతున్న రైలు, ప్లాట్‌ఫాం మధ్య వరకు చేరుకుంది. ఇదంతా చూస్తున్నవారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
On 29.11.21 SI/Bablu Kumar of RPF Post Purulia saved the life of a lady passenger while she was trying to de-board & almost come in the gap between train & platform in running train no 22857 at Purulia station.@RPF_INDIA @sanjay_chander @zscrrpfser@ADRARAIL pic.twitter.com/qC5eHeDu45
— RPF Adra Division (@rpfserada) November 30, 2021
అప్పుడు అక్కడే విధులు నిర్వర్తిస్తోన్న ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బబ్లు కుమార్ చురుగ్గా స్పందించారు. వేగంగా పరిగెత్తి ఆ మహిళను వెనక్కి లాగారు. అక్కడ వేచి ఉన్న ప్రయాణికులు కూడా వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటన నవంబర్ 29న జరిగిందని ఆర్‌పీఎఫ్ సిబ్బంది వెల్లడించారు.
Also Read: Telangana paddy procurement : బాయిల్డ్ రైస్ కొనమని ముందే చెప్పాం : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
Also Read: Jawad Cyclone Update: తుపానుగా మారనున్న అల్పపీడనం.. ఆ మూడు రాష్టాల్లో తీవ్ర ప్రభావం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook