Russia-Ukraine War Effect: ఏప్రిల్ నుంచి భారీగా పెరగనున్న ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ ధరలు

Russia-Ukraine War Effect: ప్రపంచదేశాల ప్రయత్నాలు విఫలమై..ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రభావం ఇంధన ధరలు, గ్యాస్ ధరలపై భారీగా పడనుందని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2022, 10:58 AM IST
  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఇండియాపై తీవ్రమేనా
  • ఎల్పీజీ-సీఎన్జీ ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నాయా
  • ముడి చమురు, సహజవాయువు దిగుమతులకు ఇబ్బంది, కొరత ఏర్పడే ప్రమాదం
 Russia-Ukraine War Effect: ఏప్రిల్ నుంచి భారీగా పెరగనున్న ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ ధరలు

Russia-Ukraine War Effect: ప్రపంచదేశాల ప్రయత్నాలు విఫలమై..ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రభావం ఇంధన ధరలు, గ్యాస్ ధరలపై భారీగా పడనుందని తెలుస్తోంది. 

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం ప్రపంచదేశాలతో పాటు భారతదేశాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల యుద్ధం ప్రభావం ఇండియాపై తీవ్రంగానే ఉండనుంది. ముఖ్యంగా ఇంధన, గ్యాస్ ధరలు భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల యుద్ధం కారణంగా నికర ఇంధన దిగుమతిదారులకు ప్రతికూల ప్రభావం చూపించనుందనేది మూడీస్ ఇన్వెస్ర్ సర్వీస్ అంచనా. ఎందుకంటే రష్యా రెండవ అతిపెద్ద చమురు ఎగుమతి దేశంగా ఉంది. మరోవైపు ఇండియా ముడి చమురు అవసరాల్లో 85 శాతం, గ్యాస్ అవసరాల్లో 50 శాతం రష్యా నుంచే దిగుమతి అవుతోంది. అందుకే ఇంధన దరలు, గ్యాస్ ధరలు భారీగా పెరగవచ్చని సమాచారం. ముడి చమురును పెట్రోల్, డీజిల్ ఇంధనాలుగా, గ్యాస్‌ను సీఎన్జీ, ఎల్పీజీగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు బ్యారెల్ 100 డాలర్లకు చేరుకుంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సెంట్రల్ ఆసియాలోని వస్తువుల ఉత్పత్తిదారులు చైనాకు సరఫరాను పెంచే అవకాశాలున్నాయి. అయితే దిగుమతుల మళ్లింపు ఇతర కారణాలతో వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టేషన్ లింక్‌కు ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి దేశంలో ఎల్పీజీ, సీఎన్జీ ధరలు పెరగవచ్చని తెలుస్తోంది. ప్రతి ఆరునెలలకోసారి గ్యాస్ ధరల్ని నిర్ణయించే ప్రభుత్వం..ఏప్రిల్ నెలలో మరోసారి సవరించనుంది. ఇప్పుడీ యుద్ధం కారణంగా కచ్చితంగా గ్యాస్ కొరత ప్రభావం ఎదురై..ధరలు పెరగవచ్చని అంచనా.

Also read: Nawab Malik Arrest: డీ గ్యాంగ్‌తో లింకులు..? మంత్రి నవాబ్ మాలిక్‌పై ఈడీ సంచలన కేసు.. అరెస్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News