Supreme Court on Lakhimpur: లఖీంపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుల్ని ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై కారణమైన నిందితుల్ని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖీరీ(Lakhimpur Khiri) ఘటన ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉంది. నిన్నటి వరకూ రాజకీయంగా ఇప్పుడు న్యాయపరంగా. లఖీంపూర్ ఖీరీ ఘటనపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల్ని ఇప్పటి వరకూ ఎందుకు అరెస్టు చేయలేని నిలదీసింది. ఇతర హత్య కేసుల్లో కూడా నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తారా అంటూ మండిపడింది. సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఘాటుగా ప్రశ్నించింది. మరో దర్యాప్తు సంస్థతో విచారణ విషయంలో తరువాత నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పటి వరకూ ఆధారాల్ని భద్రంగా ఉంచాలని కోరింది. లఖీంఫూర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఈ కేసును సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ(Justice NV Ramana), జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిల ధర్మాసనం విచారణ నిర్వహిస్తోంది. అటు యూపీ ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదననలు విన్పించారు. కేసులో ప్రదాన నిందితుడికి సమన్లు జారీ చేశామని వివరణ ఇచ్చారు. 8 మంది మృతికి కారణమైన ఘటనలో నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాల్సిన అవసరముందని ధర్మాసనం పేర్కొంది. బాధితుల శరీరంలో బుల్లెట్ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో చెప్పడంతో..ఈ కారణంతో నిందితుల్ని అరెస్టు చేయలేదా అని సుప్రీంకోర్టు(Supreme Court)తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను దసరా అనంతరం చేపడతామని చెబుతూ అక్టోబర్ 20వ తేదీకు వాయిదా వేసింది. మరోవైపు లఖీంపుర్ ఖీరీ ఘటనలో మృతుల కుటుంబాల్ని తాను కలుస్తానంటూ వచ్చిన వార్తల్ని జస్టిస్ ఎన్‌వి రమణ ఖండించారు.
మరోవైపు ఈ ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన ఇంకా కొనసాగుతోంది. లఖీంపూర్ ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఈనెల 11 వ తేదీలోగా పదవి నుంచి తొలగించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తోంది. లేకుంటే 18వ తేదీన రైలో రోకో చేస్తామని..ప్రధాని మోదీ నివాసాన్ని దిగ్భంధిస్తామని హెచ్చరించింది. విచారణకు హాజరు కావల్సిందిగా యూపీ పోలీసులు(UP Police)జారీ చేసిన నోటీసులకు అజయ్ మిశ్రా స్పందించలేదు.
Also read: Punjab Congress: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్దూ కోపం ఇంకా చల్లారలేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook