భారత్ కు చెందిన అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్ల సూచీలో 'టాటా' టాప్ 5లో చోటు సంపాదించింది. గతేడాది టాటా ఏడో స్థానంలో ఉంది. ఈ సంవత్సరం ప్రకటించిన జాబితాలో మూడు స్థానాలు పైకి ఎగబాకి నాలుగో స్థానములో నిలిచింది. మొదటి స్థానంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ (దక్షిణ కొరియా) నిలిచింది. ట్రస్ట్ రీసర్చ్ అడ్వైజరీ (టీఆర్ఏ) సంస్థ ఈ సర్వే చేపట్టింది.
16 నగరాలకు చెందిన 2450 మంది కస్టమర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా అధ్యయనం చేసిన తరువాత టీఆర్ఏ 'టాటా' కు నాలుగో స్థానాన్ని ఇచ్చింది. గతేడాది అగ్రస్థానంలో నిలిచిన ఎల్జీ, సోనీలను పక్కకు నెట్టి సామ్సంగ్ ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇదే జాబితాలో భారత్ కు చెందిన కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి. హొండా మోటార్స్ ఐదవ స్థానంలో, యాపిల్, మారుతీ సుజుకీ, బజాజ్, డెల్ టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. రిలయన్స్ 15 స్థానాలు దాటి 11 వ స్థానంలో నిలువగా.. పతంజలి ఏకంగా 87వ స్థానం నుంచి 12వ స్థానానికి దూసుకుపోయింది.