Vandebharat Express: విశాఖపట్నం వరకూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఎక్కడెక్కడ ఆగుతుందంటే

Vandebharat Express: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్. దేశంలో అత్యంత ఆధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు కాకుండా విశాఖ వరకూ నడవనుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2023, 08:30 AM IST
Vandebharat Express: విశాఖపట్నం వరకూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఎక్కడెక్కడ ఆగుతుందంటే

భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు రానుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణకు కేటాయించిన రైలు..రెండు తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ సాగనుంది. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడెక్కడ ఆగుతుందో వివరాలు తెలుసకుందాం..

దక్షణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేటాయించింది. త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏపీకు కేటాయించనుంది. తెలంగాణకు కేటాయించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ముందు విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడపాలనుకున్నారు. ఇప్పుడు రూట్ మార్చింది దక్షణ మధ్య రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాల్ని పూర్తిగా కలిపేలా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకూ సాగనుంది.

సికింద్రాబాద్ -విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ జనవరి 19న ప్రారంభించనున్నారు. ఏపీకు కేటాయించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాక ఆలస్యమయ్యే అవకాశమున్నందున..సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం వరకూ పొడిగించింది సౌత్ సెంట్రల్ రైల్వే. 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందంటే

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఇదే విషయాన్ని మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ 7 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8వ రైలు. 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకతలు

ఇందులో కోచ్‌లు చాలా అత్యాధునికంగా ఉంటాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ఇందులో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం 16 కోచ్‌లు 1128 సీట్లు ఉంటాయి. ఇతర రైళ్లతో పోలిస్తే సమయం ఆదా అవుతుంది. వైఫై, హాట్‌స్పాట్ సౌకర్యముంటుంది. జీపీఎస్ ఆధారిత ఆడియో విజ్యువల్ ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్స్ ప్రత్యేకత. ప్రతి కోచ్‌కు ప్యాంట్రీ సౌకర్యం ఉంటుంది. 

Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News