West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని..దేశానికి 4 రాజధానులుండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee ) సంచలన ప్రకటన చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ( West Bengal Assembly Elections ) సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాటల యుద్ధంతో రాజకీయం వేడెక్కుతోంది. అధికారపార్టీ టీెఎంసీ, బీజేపీ మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee ) సంచలన ప్రకటనలు చేశారు. దేశంలో పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని..అన్నింటినీ ఢిల్లీకే ఎందుకు పరిమితం చేశారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. దేశానికి నాలుగు రాజధానులుండాలని స్పష్టం చేశారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ రాజధానులుగా ఉండాలన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ( Nethaji Subhash chandrabose 125th Birth Anniversary ) వేడుకల్లో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ చేసిన డిమాండ్ దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. దేశానికి ఒకే రాజధాని ఎందుకుండాలని ప్రశ్నించారు. నాలుగు రాజధానుల అంశంపై పార్లమెంట్లో గళమెత్తాలని తమ ఎంపీలను కోరుతున్నట్టు మమతా తెలిపారు. ఆలోచనా విధానంలో మార్పు రావాలని..ఒకే నాయకుడు, ఒకే దేశం నినాదంతో ఏమీ ఒరగదని స్పష్టం చేశారు మమతా బెనర్జీ. ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్న తరుణంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. నేతాజీ జయంతి ( Nethaji Jayanti ) ని పరాక్రమ్ దివస్‌గా కేంద్రం ఎందుకు ప్రకటించిందో అర్ధం కావడం లేదన్నారు. నిజంగానే నేతాజీపై ప్రేమ ఉండి ఉంటే..నేతాజీ డాక్‌గా ఉన్న పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ డాక్‌గా ఎందుకు మార్చారని ప్రశ్నించారు.
Also read: Covid19 vaccine Availability: వ్యాక్సిన్ ఓపెన్ మార్కెట్‌కు రాదు: కేంద్ర ఆరోగ్య శాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook