Young Woman Raped: కదులుతున్న ట్రైన్​లో యువతి అత్యాచారం- సీటు ఇస్తానని నమ్మించి..!

Young Woman Raped: భోపాల్​లో ఓ కామాంధుడు కదులుతున్న రైళ్లో యువతిని అత్యాచారం చేశాడు. పోలీసులు సమాచారం అందుకుని అక్కడకు వచ్చే లోపు అక్కడి నుంచి పరారయ్యాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 06:03 PM IST
  • మధ్య ప్రదేశ్​లో దారణం
  • రైళ్లో యువతిపై అత్యాచారం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు
Young Woman Raped: కదులుతున్న ట్రైన్​లో యువతి అత్యాచారం- సీటు ఇస్తానని నమ్మించి..!

Young Woman Raped: దేశవ్యాప్తంగా అత్యచారాలను జరగకుండా ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. నిత్యం ఎక్కడో ఓ చోట అలాంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. మరీ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. సురక్షితంగా భావించే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం.

నిర్భయ, దిశ వంటి ఘటనలతో చట్టాలు, రూల్స్​ కట్టుదిట్టం చేస్తున్నా కొందరు మృగాళ్లు మారడం లేదు.

తాజాగా మధ్య ప్రదేశ్​లోని భోపాల్​లో ఇలాంటి అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది.

కూర్చునేందుకు చోటు ఇస్తానని..

సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు యశ‍్వంత్ పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ‍్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఓ యువతి యువతి టికెట్ కన్ఫార్మ్ కాకపోవడంతో దీనితో ఏసీ 3 టైర్ కోచ్ వెలువల కూర్చుంది.

అయితే గమనించి ఓ వ్యక్తి.. ఆ యువతిని వంట గదిలో కూర్చునేందుకు చోటు ఉందని చెప్పి నమ్మించాడు. ఆ యువతి కూడా కూర్చునేందుకు స్థలం దోరుకుంతుందని అ వ్యక్తి వెంట వెళ్లింది.

చెప్పినట్లుగానే.. స్థలం ఇప్పించాడు ఆ వ్యక్తి. అయితే అమె నిద్రలోకి జారుకున్న తర్వాత తన నిజ స్వరూపం బయటపెట్టాడు ఆ వ్యక్తి. నిద్రలో ఉన్న ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని భోపాల్​ స్టేషన్​కు చేరుకున్నారు. డోర్​ తెరిచి చూడగా.. ఆ యువతి అపస్మారక స్థితిలో పడి ఉండి. అప్పటికే అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.

దీనితో పోలీసులు.. వంట గదికికి సంబంధించిన స్టాఫ్​, వెండర్స్ కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. నింధితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Hijab Row: ఇది మా అంతర్గత వ్యవహారం.. హిజాబ్ వివాదంపై పాక్‌, అమెరికాకు భారత్ కౌంటర్

Also read: Uttarakhand Earthquake: ఉత్తరాఖండ్​లో భూకంపం... రిక్టర్​ స్కేలుపై 4.1 తీవ్రత నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News