Biotin: జుట్టును కుదుళ్ల నుంచి దృఢపరిచే 5 బయోటిన్ ఆహారాలు.. గోళ్లను కూడా బలంగా మారుస్తాయి..

Biotin Rich 5 Foods: బయోటిను విటమిన్ బి7 అంటారు. ఇది బీ కాంప్లెక్స్ కుటుంబానికి చెందినది. ఈ బయోటిన్‌ విటమిన్ హెచ్ అని కూడా అంటారు. ఇది నీళ్లలో కరిగే ఫైబర్. అయితే మన శరీరంలో ఎప్పటికప్పుడు బయోటిన్ స్థాయిలను తనిఖీ చేస్తూ ఉండాలి. సమతులంగా ఉండేలా జాగ్రత్త పడాలి.

Written by - Renuka Godugu | Last Updated : Feb 3, 2025, 09:49 PM IST
Biotin: జుట్టును కుదుళ్ల నుంచి దృఢపరిచే 5 బయోటిన్ ఆహారాలు.. గోళ్లను కూడా బలంగా మారుస్తాయి..

Biotin Rich 5 Foods: బయోటిన్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు తినడం వల్ల మన చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పడుతుంది. గోర్లు కూడా తరచూ విరిగిపోకుండా ఉంటాయి. సాదరణంగా బయోటిన్ సప్లిమెంట్స్ ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆహారాలలో బయోటిన్ సహజ సిద్ధంగా ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. 

పాలకూర..
ఆకుకూరలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ముఖ్యంగా పాలకూర డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది బయోటిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. ఇందులో సహజసిద్ధమైన బయోటిన్ ఉంటుంది.. దీని స్మూథీ లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. పాలకూరను వెల్లుల్లితో వేయించి తీసుకోవడం వల్ల మంచి సైడ్ డిష్ ల మారుతుంది 

సీ ఫుడ్..
ప్రోటీన్ పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాల్లో బయోటీన్‌ కూడా ఉంటుంది. ముఖ్యంగా లీన్ మీట్ కొన్ని రకాల సముద్రపు ఆహారాల్లో కూడా ఉంటుంది. రెడ్‌ మీట్‌లో కూడా ఎక్కువ మోతాదులో బయోటిన్ ఉంటుంది.. అయితే కొన్ని రకాల సీ ఫుడ్స్ అంటే సర్డైన్‌, సాల్మన్ చేపలో బయోటిన్ ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మం, జుట్టుతో పాటు గోర్లకు కూడా ఆరోగ్యం.

గింజలు, విత్తనాలు..
గింజలు విత్తనాలు మన శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్స్, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తారు. బాదం వంటివి తీసుకోవటం వల్ల మన జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.. ఇంకా చియా, సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో కూడా ప్రోటీన్ పుష్కలం. ఇందులో విటమిన్ ఇ ఆరోగ్యకరమైన కొవ్వులు మన చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మంచి పోషణ అందిస్తాయి. కుదుళ్ల నుంచి జుట్టు దృఢంగా మారుస్తుంది. బయోటిన్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గోళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు గుప్పెడు గింజలు తినడం అలవాటు చేసుకోవాలి. 

ఇదీ చదవండి:  బొప్పాయిని పొరపాటున ఈ 4 ఆహార పదార్థాలతో తినకూడదు తెలుసా?

గుడ్లు..
గుడ్లలో కూడా బయోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఒక 10 గ్రాముల బయోటిన్ ఒక గుడ్డులో ఉంటుంది.. అంతేకాదు ఇందులో  ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ లో తరచూ గుడ్లు చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన బయోటిన్‌ అందుతుంది. 

చిలకడదుంప.. 
చిలకడదుంప రుచికరంగా ఉంటుంది. ఇందులో బయోటీన్‌ మోతాదు కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఇందులో బీటాకెరోటీన్‌ ఉంటుంది. ఇది విటమిన్ ఏ గా మారి మన చర్మం కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఆరోగ్యకరమైన కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. బయోటిన్ స్థాయిలను మెరుగుపరిచే చిలగడ దుంపను ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ఇందులో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యంతో పాటు కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది..

ఇదీ చదవండి: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే చిన్ని చిట్కా.. హార్ట్ ఎటాక్ అడ్రస్ లేకుండా పోతుంది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News