Black Tea For Weight Loss: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో టీ ఒకటి. ప్రతి రోజూ టీ తాగని వారు ఉండరు. చిన్న వయసు నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒకరు, ప్రతి రోజు టీని తీసుకుంటారు. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి రోజూ బ్లాక్ టీని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నప్పటికీ.. రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఈ టీని తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్లాక్ టీ తాగడం వల్ల నిజంగా ప్రయోజనాలు కలుగుతాయా?
బ్లాక్ టీని 'కామెలియా సినెన్సిస్' ఆకుల నుంచి తయారు చేస్తారు. ఈ చెట్టులో కెఫిన్ అధికంగా పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్లాగ్ టీని ఎండిన ఆకులు, మొగ్గలు చూర్ణంతో తయారు చేస్తారు. ఇది పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. దీని వల్ల టీ పౌడర్ చాలా ప్రభావవంతంగా తయారవుతుంది.
బ్లాక్ టీ ఆరోగ్య ప్రయోజనాలు:
బ్లాక్ టీని ప్రతి రోజు తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
బ్లాక్ టీ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బ్లాక్ టీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది.
బ్లాక్ టీ అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
ఏకాగ్రతను పెంచడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
బరువు తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
బ్లాక్ టీ చర్మ, జుట్టును ఆరోగంగా ఉంచడానికి సహాయపడుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ
Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook