Buttermilk Benefits In Telugu: మజ్జిగ తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే చాలా మంది తిన్న తర్వాత దీనిని తాగుతూ ఉంటారు. ముఖ్యంగా మజ్జిగలో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ B12, రిబోఫ్లావిన్ వంటివి శరీరంలోని వివిధ రకాల చర్యలకు అవసరమైన శక్తిని అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మజ్జిగలో పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా లభిస్తాయి. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు పొట్టలో గ్యాస్ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
శరీరానికి చల్లదనం ఇస్తుంది:
వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చల్లదనం కలుగుతుంది. దీంతో పాటు ఉష్ణం వల్ల కలిగే ఇబ్బందులను తగ్గిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
శరీర బరువు తగ్గడానికి..:
మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును కరిగేలా చేస్తుంది. దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
హైడ్రేషన్:
మజ్జిగలో ఉండే నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శరీరానికి చల్లధనాన్ని అందించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు తగ్గించేందుకు సహాయపడుతుంది.
పోషకాలు:
మజ్జిగలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. దీని కారణంగా అన్ని సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఎముకల ఆరోగ్యం:
ఎముకల ఆరోగ్యానికి మజ్జిగ ఎంతగానో సహాయపడుతుంది. తరచుగా ఎముకల సమస్యలను తగ్గించేందుకు కూడా కాల్షియం ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
చర్మ ఆరోగ్యం:
మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిస్తుంది. దీంతో పాటు ఇందులో ప్రోబయోటిక్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని కారణంగా అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.