Copper water bottle Health benefits: రాగితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా రాగిని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. పురాణ కాలంలో రాగి పాత్రలో నీటిని నిలువ చేసుకొని తాగేవారు. ఆయుర్వేద పరంగా కూడా రాగి పాత్రలో నీటిని నిల్వచేసుకుని తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో రాగి బాటిల్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. అయితే దీంట్లో నీటిని నిలువ చేసుకొని తాగడం వల్ల వాత, పితా, కఫ దోషాలు కూడా తొలగిపోతాయి ఆయుర్వేద పరంగా రాగి పాత్రలో నీటి నిల్వ చేసిన వాటిని తామ్రాజల్, తీర్థం అని కూడా పిలుస్తారు. రాగి బాటిళ్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది..
రాగి బాటిల్ లో నీటి నిల్వ చేసుకోవటం వల్ల ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రాణాంతక బ్యాక్టిరియా కడుపులో నుంచి బయటికి తరిమేస్తాయి. రాగి బాటిల్లో నీటి నిల్వ చేసి తాగటం వల్ల బాడీని క్లెన్స్ చేస్తుందని ఒక వార్తాపత్రికను వేదిక తెలిపింది. ఇలా రాగి పాత్రలో నీటి నిల్వ చేయడం వల్ల అందులో కాపర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మన శరీరానికి రాగి కూడా అందుతుంది.
ఎనీమియా..
రాగి బాటిల్ లో నీటి నిల్వ చేసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుందని నివేదిక తెలిపింది. అంతేకాదు రక్తంలో ఆక్సిజన్ కూడా శరీరం అంతటికి వ్యాపిస్తుంది. రాగి పాత్రలో నీటి నిల్వచేసి తాగడం వల్ల మన శరీరం ఐరన్ ని గ్రహిస్తుంది. దీంతో ఎనీమియా సమస్య రాదు. రాగి పుష్కలంగా ఉండే నీటిని తీసుకోవటం వల్ల ఎనీమియా మీ దారిదాపుల్లోకి రాదు.
థైరాయిడ్..
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా రాగి బాటిల్లో నీటిని నిల్వ చేసి తాగాల్సి ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ ఉద్దీపనం చేస్తుంది. రాగి బాటిల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం వల్ల థైరాయిడ్ హార్మోని నివారిస్తుంది.
బరువు తగ్గుతారు..
రాగి బాటిల్ లో నీటి నిల్వ చేసి తాగడం వల్ల మన శరీరంలో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ రాగి మన కొవ్వును కరిగించేస్తుంది దీంట్లో బరువు సులభంగా తగ్గిపోతారు. అయితే రాగి పాత్రలో నీటిని నిల్వ చేసి తాగడం వల్ల ప్రభావంతమైన ఫలితాలు కనిపిస్తాయి.
గుండె ఆరోగ్యం..
రాగి బాటిల్ లో నీటిని నిల్వ చేసుకుని తాగడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు ఎముకల అభివృద్ధి కూడా సహాయపడుతుంది. దీనివల్ల రాగి బాటిల్ అనేటివి నిల్వ చేసుకోవడం వల్ల మెదడు, గుండె, ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా యాక్టివ్ గా ఉంటుంది. వాపు సమస్య రాకుండా ఉంటుంది.
ఇదీ చదవండి: మలబద్ధకం సమస్య మందులతో తగ్గటం లేదా? ఈ గింజలు వాడి చూడండి..
బలమైన ఇమ్యూనిటీ..
రాగి బాటిల్ లో నీటిని నిల్వ చేసుకోవటం వల్ల ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.
చర్మ ఆరోగ్యం..
ఈ నీటిని తీసుకోవడం వల్ల చర్మంపై మెలానిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇందులో కాపర్ పుష్కలంగా ఉండటం వల్ల మీ జుట్టు చర్మం కళ్ళు, ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు వెంట్రుకలు తెల్లబడకుండా ఆలస్యం చేస్తుంది. చర్మానికి పునరుజ్జీవనం అందిస్తుంది.
ఇదీ చదవండి: స్ట్రాబెర్రీలు తింటున్నారా? అయితే, మీకు ఈ 5 రోగాలు దరిచేరవు..
జాయింట్ పెయింట్స్..
రాగి బాటిల్ లో నీటి నిల్వ చేసి తాగటం వల్ల వాపు, నొప్పుల సమస్యలు రావు ఆర్థరైటిస్తో బాధపడేవారు నీటిని తాగాలి ఇది వాపు సమస్యను వెంటనే తగ్గిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి