Cutard Apple Leaves Tea: సీతాఫలం అంటే ఇష్టపడిన వారు ఉండరు. తినడానికి ఎంతో రుచి కలిగి ఉండడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సీతాఫలం పనిలే కాకుండా వాటి ఆకులు కూడా శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయని వాటిని టీలా చేసుకుని తాగితే చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సీతాఫలం ఆకుల టీని తాగడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయే ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మ సమస్యల నుంచి ఉపశమనం:
సీతాఫలం ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని టీ ల చేసుకొని తాగడం వల్ల ముఖంపై మొటిమలు ఇతర అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
కళ్లకు మంచిది:
సీతాఫలం ఆకుల టీని ప్రతిరోజు తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పరిమాణం కంటిచూపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జీర్ణక్రియకు మంచిది:
ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సీతాఫలం ఆకుల టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తాయి:
సీతాఫలం ఆకుల టీని క్రమం తప్పకుండా తాగితే శరీరానికి విటమిన్ B6 అధిక పరిమాణంలో లభిస్తుంది. దీంతో ఒత్తిడి సమస్యలు దూరం అవుతాయి. ఆఫీస్ కారణంగా ఒత్తిడి సమస్యలకు గురవుతున్న వారు తప్పకుండా ఈ ఆకులతో తయారు చేసిన టీ ని క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Niharika Konidela: ఆ విషయంలో మా అత్త కాళ్లు మొక్కాలంటున్న మెగా డాటర్!
Also Read: చిరు ఫ్యాన్ నేను.. అందుకే అలా ట్వీట్ చేశా.. ఎట్టకేలకు నోరు విప్పిన వర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook