Guava Leaves Benefits: జామకాయ మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. అంతేకాదు మలబద్దక సమస్యను నివారిస్తుంది.. మంచి జీర్ణ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. అయితే జామకాయతో పాటు ఆకుల్లో కూడా ఈ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుంది. జామకాయ ఆకులు యాంటీ మైక్రోబియన్ గుణాలు ఉంటాయి.. మీ కడుపులో అజీర్తి, గ్యాస్ ఉంటే ఆకులతో టీ తయారుచేసుకొని తీసుకోవాలి.. దీంతో మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు జామ ఆకులను డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. అంతేకాదు జామ ఆకులను డైట్ లో చేర్చుకుంటే బరువు నిర్వహణలో ఉంటుంది.. ఈ జామ ఆకులను కడిగే శుభ్రం చేసి వీటితో చిన్నగా కట్ చేసి తయారు చేసుకోవచ్చు. దీంతో మీ మెటబాలిజం రేటు పెరుగుతుంది, కొవ్వును కరిగించేస్తుంది.. జామ ఆకులను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. దీంతో అతిగా ఆకలి వేయకుండా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారల జోలికి పోకుండా ఉంటాము..
జామ ఆకులను మన డైట్ లో చేర్చుకుంటే ఇందులో ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. దీనితో సీజనల్ జబ్బులు మన దరిచేరకుండా ఉంటాయి. రెగ్యులర్ డైట్‌లో జామ ఆకులు తీసుకోవడం వల్ల ప్రాణాంతక వైరస్ వ్యాధులు మన దరిచేరవు బ్యాక్టీరియాతో పోరాడే గుణం జామ ఆకుల్లో ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఓ షీల్డ్‌లా కాపాడుతాయి. ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.
ఇదీ చదవండి: Rose Water: ఈ నీరు ఉంటే చాలు.. ఏ ఫేస్ క్రీముల అవసరం ఉండదు..
అంతేకాదు జామ ఆకులు డయాబెటిస్ రోగులు కూడా మేలు చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్లతో బాధపడేవారు జామ ఆకులను తరచు తీసుకోవాలి. ఇందులో గ్లైసేమిక్ సూచి కూడా తక్కువగా ఉంటుంది.. రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వకుండా కాపాడుతాయి. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ మీకు అదుపులో ఉంటాయి. జామ ఆకులతో తయారు చేసిన టీ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగులకు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
జామ ఆకులు తీసుకోవడం వల్ల ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి లైకోపీన్ బేటా కేరోటిన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆక్సిలేటివ్ డామేజ్ కాకుండా ఇన్ఫర్మేషన్ సమస్యను తగ్గిస్తుంది. రక్తనాళాలను మెరుగు పరుస్తాయి. తరచూ జామ ఆకులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోయి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో మీ కార్డియో ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ రూ. 2249 VS రూ.1849 ప్లాన్.. ఈ ప్లాన్‌లో ఎక్కువ బెనిఫిట్స్ తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.