Happy Diwali 2022 Greetings Card: భారత దేశంలో దీపావళి పండగకు ఎంతో ప్రముఖ్యత ఉంది. ఈ పండగన భారత దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు చోట్ల దీపావళి సంబరాలు మొదలైయ్యాయి. అయితే ఈ క్రమంలో హిందువులంతా లక్ష్మి దేవిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. దీపావళి రోజునా దీపాలను వెలిగించి లక్ష్మి దేవిని పూజంచడం వల్ల అనే ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆర్థిక పరమైన సమస్యలు తగ్గి..వ్యాపార రంగాల్లో లాభాలు పొందే అవకాశాలున్నాయి. అందుకే అందరూ లక్ష్మిదేవిని పూజిస్తారు. అయితే లక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునే వారు తప్పకుండా భక్తి శ్రద్ధలతో పూజించాల్సి ఉంటుంది. లక్ష్మి పూజలో భాగంగా తప్పకుండా దీపాలను వెలిగించాలి. అయితే మీ మిత్రులను సంతోష పరిచేందు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. వారి ముఖాల్లో చిరునవ్వు నింపండి.
ఇలా మీ మిత్రులకు శుభాకాంక్షలు తెలపండి:
ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ..
"దీపావళి శుభాకాంక్షలు"
లక్ష్మి మీ ఇంట నర్తించగా, సంతోషం పాలై పొంగగా దీపకాంతులు వెలుగునీయగా ఆనందంగా జరుపుకొండి దీపావళి పండుగ..
"దీపావళి శుభాకాంక్షలు"
టపాసుల కేళి.. ఆనందాల రవళి..
ప్రతి ఇంటా జరగాలి.. ప్రభవించే దీపావళి
అజ్ఞాన చీకట్లు పారద్రోలి మన జీవితంలోకి వెలుగు నింపే దీపావళి అందరికి శుభం చేకూర్చాలని కోరుతూ..
"దీపావళి శుభాకాంక్షలు"
దీపావళి దివ్య కాంతుల వేళ, శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా, మీకు, మీ కుటుంబ సభ్యులందరికి సుఖసంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం. సమృద్ధి, స్నేహం ఎల్లపుడూ మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ.."దీపావళి శుభాకాంక్షలు!"
ఈ దీపావళి మీ ఇంట నిత్య ఆనంద కాంతులు నింపాలని కోరుకుంటూ.. మీ ఇంటిల్లిపాదికీ
దీపావళి నాడు మీరు వెలిగించే దీపాలు..
మీ ఒక్కరి జీవితాల్లోనే కాకుండా.. అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు "దీపావళి శుభాకాంక్షలు."
Also Read: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!
Also Read: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook