Happy New Year 2024: హ్యాంగోవర్ పోవడానికి ప్రత్యేక ఇంటి చిట్కాలు..

Tips for Recovering From Hangover: అతిగా తాగడం వల్ల చాలా మందిలో హ్యాంగోవర్ వస్తుంది. దీని కారణంగా తల నొప్పి, ఇతర సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ ఇంటి చిట్కాలు పాటించండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 08:31 PM IST
Happy New Year 2024: హ్యాంగోవర్ పోవడానికి ప్రత్యేక ఇంటి చిట్కాలు..

Tips for Recovering From Hangover: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. పాత సంవత్సరానికి గుడ్‌బై చెబుతూ కొత్త సంవత్సరానికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు కొంతమంది ఇప్పటికే నుంచే ట్రిప్స్‌, పార్టీలకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్‌ని స్పెషల్‌గా మార్చుకోవడానికి, ఉదయం వరకు హ్యాంగోవర్ తగ్గకుండా బాగా తాగుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ  హ్యాంగోవర్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో హ్యాంగోవర్ కారణంగా తలనొప్పి, అసిడిటీ, అలసట వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటించి సులభంగా ఉపశమనం పొందవచ్చు. 

నీటిని ఎక్కువగా తీసుకోవాలి:
అతిగా డ్రింక్‌ చేసిన తర్వాత హ్యాంగోవర్ వల్ల ఇతర సమస్యలు రాకుండా ఉండడానికి నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉన్న నీటిని ప్రతి రోజు తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎక్కువగా డ్రింక్‌ చేసిన తర్వాత తరచుగా మూత్రవిసర్జన, వాంతులు, అలసట కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు., 

అల్లం :
హ్యాంగోవర్ నుంచి ఉపశమనం పొందడానకి అల్లం టీని కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా అల్లం రసాన్ని నీటిలో కలుపుకుని ఉప్పును మిక్స్‌ చేసుకుని తీసుకుంటే సులభంగా హ్యాంగోవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

కొబ్బరి నీరు:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరమంతా పొడిబారుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కొబ్బరి నీటిని తాగాల్సి ఉంటుంది. ఈ నీటిలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా లభిస్తాయి. దీని కారణంగా హ్యాంగోవర్ నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

నిమ్మరసం: 
నిమ్మరసంలో సిట్రిక్ పండ్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని తీసుకోవడం హ్యాంగోవర్ నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, వాంతుల రాకుండా కూడా ఉంటాయి.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News