Health Care Tips: చాలా మంది పని చేస్తున్న క్రమంలో కుర్చీపై కూర్చున్నప్పుడు కాళ్ళు కదలడం చేస్తూ ఉంటారు. అంతేకాకుంగా కూర్చిలో కూర్చుని నిద్ర పోతున్న సమయంలో కూడా ఇలా చేస్తూ ఉంటారు. ఇలా కాళ్ళు కదలడం వల్ల ఆఫీస్‌లో పని మరింత తొందరగా చేయగలుగుతారు. కానీ ఇలా చేయడం ఏదో ఒక వ్యాధికి సంకేతమని మీకు తెలుసా.! కుర్చీపై కూర్చున్నప్పుడు కాళ్లు వణుకడం వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం..
కూర్చున్నప్పుడు కాళ్లు వణుకుట ఆందోళనకు సంకేతం:
అనేక కారణాల వల్ల కూర్చున్నప్పుడు కాళ్లు వణుకుతూ ఉంటాయి. ఇది రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ కావచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్య అని వైద్యులు చెబుతున్నారు.
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటే ఏమిటి.?
నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా నొప్పి రావడాన్ని రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అని అంటారు. ఈ నొప్పి తగ్గడం ప్రారంభమైతే కాళ్లు కదలికలు మొదలవుతాయి. ఈ సమస్య ఐరన్ లోపం వల్ల కూడా రావచ్చు.
జన్యుపరంగా కూడా ఈ సమస్య రావచ్చు:
ఇంట్లో తల్లి లేదా తండ్రి ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే..జన్యుపరంగా పిల్లలకు వచ్చే అవకాశాలున్నాయి.
ఎలా చికిత్స చేయవచ్చు?
ఈ సిండ్రోమ్‌ను నయం చేయడానికి ఫిజియోథెరపీ చికిత్స తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..!
Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను ఇట్టే కరిగించే..వంటింటి ఐదు పదార్ధాలేంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook