Home Remedies For Weight Loss: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల ఊబకాయం సమస్యల బారిన కూడా పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గుండె పోటు సమస్యలు వచ్చి ప్రాణాంతకంగానూ మారోచ్చు. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బరువు తగ్గడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం సాధరణంగా లభించే ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
హోం రెమెడీస్‌తో పెరుగుతున్న బరువును నియంత్రించండానికి సహాయపడతాయి:
1. శనగ పిండితో చేసిన ఆహార పదార్థాలు:
సులభంగా బరువు పెరుగుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారాల్లో శనగ పిండితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. శనగ పిండిలో శరీరానికి కావాల్సిన ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి సులభంగా శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది.
2. జీలకర్ర నీరు:
ఊబకాయంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ జీలకర్ర నీరును తాగాల్సి ఉంటుంది. ఈ నీరు ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా పెరుగుతున్న బరువును నియంత్రిస్తుంది. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్నవారికి రక్తంలో చక్కెరను కూడా తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా జీలకర్రను రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాల్సి ఉంటుంది.
3. నిమ్మరసాన్ని తేనెలో కలిపి నీటిని తాగండి:
శరీర బరువును నియంత్రించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే కఠినతర వ్యాయామాలు చేయకుండా ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మ రసం కలుపుకుని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానకి కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి : Jagtial Collector Yasmeen Basha: యాస్మీన్ భాషా చేతుల మీదుగా నర్సన్న పూజ.. హ్యాట్సాప్ కలెక్టర్
ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook