How To Control Mood Swings: మూడ్ స్వింగ్‌ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలతో చెక్.!

How To Control Mood Swings: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారంలో అరటి పండ్లు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు ఉండేటట్లు చూసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2023, 08:59 AM IST
How To Control Mood Swings: మూడ్ స్వింగ్‌ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలతో చెక్.!

How To Control Mood Swings: వేసవి కాలం రాక ముందే భారత్‌లో వాతావరణంలో వేడి తీవ్రత పెరిగిపోతోంది. అంతేకాకుండా చాలా మంది చెమటలు పట్టడం వల్ల తరచుగా చికాకు సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చర్మపై సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో పలు రకాల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫ్రూట్‌ డ్రింక్స్‌ కూడా ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల స్కిన్‌ హెల్తీగా ఉండడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

ఈ క్రమంలో మానసిక స్థితి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. దీంతో ఎలాంటి ఆహారాలు తినాలనిపించదు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో సెరోటోనిన్ అనే మూలకం లోపాలు ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆహారంలో అమినో యాసిడ్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా మానసిక స్థితిని స్థిరంగా ఉంటుంది.

ఆహారంలో ఈ మార్పులు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది:
ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆహారంలో అరటిపండ్లను తీసుకోవడం వల్ల ట్రిప్టోఫాన్ శరీరానికి లాభించి.. అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అందుకే అరటిపండు తినడం వల్ల మూడ్ బాగుంటుంది. అంతేకాకుండా నిద్ర లేమి సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే అరటి తీసుకునే క్రమంలోనే  ఆహారంలో బాదంను చేర్చుకుంటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బాదంపప్పులో ఫోలేట్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల  సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.

అంతేకాకుండా పైనాపిల్‌లో కూడా ట్రిప్టోఫాన్, బ్రోమెలిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి వాటిని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో సోయా ఉత్పత్తులను తీసుకోవడం మూడ్ స్వింగ్‌ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : OnePlus 11R 5G: వన్‌ప్లస్ 11R కోసం వెయిట్ చేయలేకపోతున్నారా ?

ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..

ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News