Karela Bitterness Remove Tips: షడ్రుచులు గల ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా చేదు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే చాలా మంది కాకరకాయలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తరచుగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కాకరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రక్తాన్ని శుద్ధి చేస్తుంది:
కాకరకాయలో అద్భుతమైన ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని కూడా సులభంగా శుద్ధి చేస్తుంది. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
మధుమేహానికి దివ్యౌషధం:
కాకరలో ఉండే చరంటిన్ మూలకం శరీరంలోని బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మధుమేహం కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది. ఇందులో లభించే పాలీపెప్టైడ్ శరీరానికి చాలా మేలు చేస్తాయి.
రక్తపోటును నియంత్రిస్తుంది:
కాకరలో ఉండే పొటాషియం మన శరీరంలోని రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాకుండా న్యూరోట్రాన్స్మిషన్ ప్రక్రియ మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
కాకరకాయలో చేదును తొలగించాలనుకుంటున్నారా?:
1. ఉప్పు కలపండి:
కాకరకాయ చేదు ఉన్నట్లు అనిపిస్తే తప్పకుండా, మీరు ఆ ముక్కలను కోసిన తర్వాత సుమారు 15-20 నిమిషాల పాటు వాటికి ఉప్పును పట్టించాల్సి ఉంటుంది. ఇలా పట్టించడం వల్ల చేదు తొలగిపే ఛాన్స్‌లు ఉన్నాయి.
2. తేనె లేదా చక్కెర నీటిలో వేయాలి:
కాకరకాయల నుంచి చేదు పోవడానికి వేయించడానికి ముందు తేనె లేదా చక్కెర నీటిలో వాటిని వేయాలి. ఇలా వేసిన తర్వాత దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచి వేయించుకుంటే చేదు నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. పెరుగు కూడా కాకర చేదును తొలగిస్తుంది:
కాకరకాయ నుంచి చేదు తొలగిపోవడాని పెరుగులో కాసేపు ముక్కలను నానబెట్టి ఉంచాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టిన తర్వాత వేయించుకుంటే చేదు తొలగిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి