Mint Coriander Juice: ప్రస్తుత కాలంలో చాలా మంది పోషక ఆహారం కన్నా బయట లభించే , జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్, అజీర్తి, మలబద్దకం, గుండె జబ్బులు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుకుపోవడం, అధిక బరువు, కీళ్ల నొప్పులు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ అనారోగ్యకరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకాల మందులను వాడుతున్నారు. మందులు వాడినప్పటికి ఎలాంటి ఫలితం లభించడం లేదు. అయితే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎలాంటి మందులను వాడాల్సిన అవసరం ఉండదు. ఈ జ్యూస్‌ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయి.
జ్యూస్ ను తయారు చేసుకోవడం ఎలా:
పుదీనాను, కొత్తిమీరు, పది తులసి, నిమ్మకాయ తీసుకోవాలి. వీటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా తరుగుకోవాలి. వీటిని ఒక జార్ లో ఒక గ్లాస్ నీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులను వీలైనంత మెత్తగా జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్ ను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తఇలా తయారు చేసుకున్న రోజుకు ఒక గ్లాస్ తాగాలి. దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.
ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకొని తాగడం వల్ల డయాబెటిష్, షుగర్, సీజన్ల్ వ్యాధులు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు దీని తీసుకోవడం చాలా మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు కలిగించే ఆహారపదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు జంక్ ఫూడ్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే శరీర సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ చిట్కాను పాటించడం వల్ల సులభంగాఅనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు తెలియజేస్తున్నారు.
Also Read : Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్..ఫీచర్స్, ధర వివరాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter