Monsoon Chicken Curry Recipe: వానా కాలంలో చాలా మంది శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి వివిధ రకాల ఫుడ్‌ను తింటూ ఉంటారు. అందులో ముఖ్యంగా చికెన్ లాంటి మాంసాహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం విశేషం. ఈ చికెన్‌ను ఎలా వండిన రుచిగా ఉంటుంది. కొందరు దీనిని సూప్‌గా చేసుకుంటే మరికొందరూ.. ఫ్రైలు చేసుకుంటారు. అయితే దీనిని ఎలా వండుకున్న చికెన్ కూర ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా తెలంగాణ వంటి ప్రాంతాల్లో వండే చికెన్ కర్రీలకు అధిక ప్రాధన్యత గక్కడం విశేషం. అయితే తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులున్నారు. ఏం స్పెషల్ అయిన చికెన్‌ను వండుకోవడం ఓ ప్రత్యేకత. ఈ చికెన్ కర్రీని వర్షాకాలంలో తినడం వల్ల శరీరానికి లభించే అన్ని రకాల పోషక విలువలు లభిస్తాయి. కావున అన్ని మసాల దినుసులతో ఓ కొత్త రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాం.
ఎర్రకరం చికెన్‌కి కావాల్సిన వస్తువులు:
రెండు టేబుట్ స్పూన్‌ల కాశ్మీరీ కారం, రెండు కిలోల చికెన్, కావాల్సిన ఉప్పు, రెండు టేబుట్ స్పూన్‌ల అల్లం వెల్లులి పేస్ట్, 1.5 టేబుట్ స్పూన్‌ల కారం, 1 కొత్తిమీర, 1టేబుట్ స్పూన్‌ల వెనిగర్, 2 చిటికెళ్లు రెడ్ ఫుడ్ కలర్, 2 టేబుట్ స్పూన్‌ల ఫ్రెష్ క్రీమ్
మసాలా పేస్ట్ కోసం:
పది బాదం పప్పులు, పది పిస్తా పప్పులు, మూడు పచ్చిమిర్చి, ఇంచ్ దాల్చిన చెక్క, రెండు లవంగాలు, నాలుగు యాలకలు, టేబుట్ స్పూన్ మిరియాలు వీటిలో నీళ్లు వేసి నున్నగా రుబ్బుకోవాలి.
వండడం కోసం:
3 టేబుట్ స్పూన్‌ల నూనె, 2టేబుట్ స్పూన్‌ల నెయ్యి, 1/3 కప్ పెరుగు, 1/2 కప్ వేపిన ఉల్లిపాయలు, 1/3 కప్ టొమాటో పేస్ట్, 1 టేబుట్ స్పూన్‌ల టొమాటో కేట్చాప, 2 టేబుట్ స్పూన్‌ల రెడ్ చిల్లీ సాస్, 1 టేబుట్ స్పూన్‌ల గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుట్ స్పూన్‌ల షాహీ జీరా, 1టేబుట్ స్పూన్‌ల ధనియాల పొడి, 1 టేబుట్ స్పూన్‌ల వేయించిన జీలకర్ర పొడి
తయారి పద్ధతి:
>>చికెన్‌ను ఉప్పు, అల్లం, వెల్లులి ముద్దతో బాగా మర్ధనా చేసి ముక్కలకు పట్టించాలి.
>>మసాలా పేస్ట్ కోసం పాన్‌లో పైన పేర్కొన్న పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద వేయించాలి.
>>ఇతర మసాలను, అల్లం వెల్లులి ముద్దలను వేసి చికెన్‌కు మర్ధన చేసి ఫ్రిజ్‌లో 2 గంటలు ఉంచాలి.
>> ఓ కడాయి తీసుకోని అందులో నూనె, నెయ్యి వేసి 2 గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్ తీసుకుని నూనె, నెయ్యిలో వేసి బాగా కలపాలి.
>> మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించాలి.
>> 5 నిమిషాలకి ఒక సారి చికెన్ని కలుపుకోవాలి.
>>25 నుంచి 30 నిమిషాలకి చికెన్ ఉడికి నూనె పైకి తేలుతుంది. అప్పుడు దాని పై నుంచి కొతిమీర తరుగు వేసి దింపుకోవాలి. ఈ వేడివేడి చికెన్‌ను రోటీ లేదా పరాటలో తింటే రుచి వర్ణానాతీతం.
Also read: Monsoon Health Tips: వానా కాలంలో వచ్చే జబ్బులేవైనా.. ఇలా అల్లంతో చెక్ పెట్టొచ్చు..!
Also read: Hair Care Tips: స్ట్రెయిటెనింగ్ చేసిన తర్వాత జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook