Curd-Lemon Uses: వేసవిలో ముఖ సౌందర్యం, సంరక్షణకై ఆ రెంటి మిశ్రమం తప్పకుండా రాసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఆ రెండూ కలిపి రాస్తే ఏ విధమైన సమస్యలుండవట. ఆ మిశ్రమం ఏంటి, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
ముఖ సౌందర్యం కోసం వివిధ రకాలైన పదార్ధాలు వినియోగిస్తుంటాం. ఈ క్రమంలో పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. పెరుగు, నిమ్మ కలిపిన మిశ్రమం చాలా రకాల సమస్యల్ని దూరం చేస్తుంది. పెరుగులో ఉండే గుణాలు..చర్మాన్ని మెరుగుపర్చేందుకు, యాక్ని, పింపుల్స్ లేదా రెండింటినీ దూరం చేయవచ్చు. నిమ్మలో ఉండే విటమిన్ సి, ఇతర గుణాలు చర్మానికి సంబంధించిన సమస్యలు దూరం చేస్తాయి. ఈ నేపధ్యంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరుగు, నిమ్మ కలిపిన మిశ్రమంతో ఏ విధమైన ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
డ్రై స్కిన్‌ను మెరుగుపర్చేందుకు సమస్యల్నించి విముక్తి పొందేందుకు పెరుగు, నిమ్మ చాలా బాగా ఉపయోగపడుతాయి. పెరుగు, నిమ్మలో ఉండే గుణాలు ముఖ సంరక్షణ, పింపుల్స్ వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉంటే..మీ ముఖంపై పెరుగు, నిమ్మ కలిపి రాయవచ్చు. ఇలా చేస్తే డ్రైనెస్ నుంచి విముక్తి పొందవచ్చు.
యాక్నే, పింపుల్స్ దూరం చేసేందుకు పెరుగు, నిమ్మల ఉపయోగం చాలా కీలకమిక్కడ. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, పింపుల్స్ కారణంగా తలెత్తే వాపు కూడా దూరమౌతుంది. చర్మాన్ని తేమగా ఉంచేందుకు పెరుగు, నిమ్మ చాలా బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల చర్మంలో తేమ పుడుతుంది. ఈ మిశ్రమం వినియోగించడం వల్ల చర్మం కోమలంగా ఉంచడంలో దోహదపడుతుంది. అందుకే మీరు రోజూ ముఖంపై పెరుగు, నిమ్మ మిశ్రమం రాయాల్సి ఉంటుంది.
పెరుగు, నిమ్మరసం మిశ్రమం ఎలా చేయాలంటే..ముందుగా రెండు స్పూన్స్ పెరుగు తీసుకుని..ఇందులో 1 స్పూన్ నిమ్మరసం కలుపుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని..అరగంట తరువాత శుభ్రంగా కడిగేయాలి.
Also read: White Hair Problem: తరచుగా జుట్టు తెల్లబడుతుందా..ఈ చిట్కాలు పాటించండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడేZee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.