Sprouts Poha Recipe In Telugu: పోహాతో తయారుచేసిన ఎలాంటి ఆహారాలు తీసుకున్న శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో కార్బోహైడ్ అతి తక్కువ పరిమాణంలో ఫైబర్ కాస్త ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా పోహాను తీసుకోవడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పోహాలో స్ప్రౌట్స్ వేసుకొని తీసుకుంటే ప్రోటీన్ కూడా కవర్ అవుతుంది. దీంతో రోజు బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఇవి రెండు మిక్స్ చేసుకొని తింటే.. పోషకాహార లోపం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు లంచ్ బాక్స్ లో ఈ రెసిపీని ఆహారంగా అందిస్తే చాలా బాగా తినడమే కాకుండా శక్తివంతంగా తయారవుతారు. అయితే మీరు కూడా స్ప్రౌట్స్ పోహాను ఎప్పటి నుంచో ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా సులభమైన పద్ధతిలో తయారు చేసుకోండి.
కావలసిన పదార్థాలు:
❈ పోహా
❈ పసుపు
❈ తీగవంగ
❈ కారం
❈ కొత్తిమీర
❈ నిమ్మరసం
❈ ఉల్లిపాయ
❈ ఉప్పు
❈ నూనె
❈ కరివేపాకు
❈ మొలకెత్తిన గింజలు (పప్పు, చిక్కుడు, మినప, మొదలైనవి)
తయారీ విధానం:
❈ స్ప్రౌట్స్ పోహాను తయారు చేసుకోవడానికి ముందుగా పోహాను బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయ, తీగవంగ, కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి.
❈ ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేడిచేసి ఉంచుకోండి.. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేంతవరకు బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసుకు ని మరికొద్ది సేపు వేపుకోండి.
❈ ఇలా అన్ని వేగిన తర్వాత ఇందులోనే మొలకెత్తిన గింజలు, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే మరికాస్త తగినంత ఉప్పు వేసుకొని.. బాగా మిక్స్ చేసుకోండి. చివరిగా నిమ్మకాయ రసం పిండి మరికొద్ది సేపు బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.
❈ చివరిగా కొత్తిమీర, కావాలనుకుంటే పుదీనా, పచ్చి కూరగాయలు వేసుకొని బాగా కలుపుకొని దింపుకోండి. అంతే ఎంతో సులభంగా హెల్తి పోహా రెడీ అయినట్లే. దీనిని ఉదయాన్నే అల్పాహారంలో తీసుకుంటే బోలెడు లాభాలు పొందగలుగుతారు.
సూచనలు, సలహాలు:
❈ ఈ పోహాను మరింత రుచికరంగా తయారు చేసుకోవడానికి ఇందులో మీకు ఇష్టమైన మసాలాలను కూడా వేసుకోవచ్చు. కానీ మసాలాను తక్కువ మోతాదులో వేసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
❈ ఈ పోహాను తయారు చేసుకునే క్రమంలో తప్పకుండా బాగా నీటిలో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొలకెత్తిన గింజలతో పాటు వివిధ రకాల కూరగాయలను కూడా వినియోగించవచ్చు.
❈ ఈ పోహాను ఎక్కువగా వేడి పైనే తింటే అద్భుతమైన రుచిని పొందగలుగుతారు. కొంతమంది ఈ పోహాలో వేరుశనగల చట్నీ వేసుకొని కూడా తింటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter