Immediate Constipation Relief: మలబద్దకం సమస్య బారిన చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా పడుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలి అనుకొనేవారు ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
➾ ప్రతిరోజు 15 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల పేగుల కదిలిక మెరుగుపడుతుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.
➾ ఖర్జూర పండును వేడి నీటిలో నానబెట్టి పడుకునే ముందు తీసుకోవాలి. దీని వల్ల మలబద్దక సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
➾ ఎండు ద్రాక్షలను నానబెట్టి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
➾ బొప్పాయి ముక్కలను తినడం వల్ల కడుపులో పేగులు ఆహారాని జీర్ణం చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
➾ అంజీర పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
➾ అలోవెరా జ్యూస్ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
➾ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
➾ మలబద్దంతో బాధపడుతున్నవారు మాంసం తినకుండా ఉండటం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read Uses Of Apple: లైంగిక శక్తిని పెంచడంలో యాపిల్ జ్యూస్ ప్రయోజనాలు ఇవే!
➾ ఓట్స్‌లో బీటా-గ్లూకాన్స్ ఉంటాయి. దీని వల్ల ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది.
➾ నెయ్యి ని తీసుకోవడం వల్ల పేగుల కదలికలను వేగవంతం చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
➾ పండు, కూరగాయాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతిరోజు మీ ఆహారంలో పండ్లు తీసుకోవడం మంచిది.
➾ పాలు తాగడం వల్ల మలబద్దకం సమస్యను నివారించవచ్చు.
➾ అత్తి పండు తీసుకోవడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది.
➾ వ్యాయామం చేయడం వల్ల మలబద్దం తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
➾ రేగి పండ్ల తీసుకోవడం వల్ల మలబద్దం సమస్య తగ్గుతుంది.
➾ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
Also Read Teeth Whitening Naturally: ఈ చిట్కాలను పాటించడం వల్ల తెల్లటి దంతాలు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter