Weight Control Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో ఊబకాయం అందర్నీ వేధిస్తోంది. పెద్దవాళ్లే కాదు. చిన్నారులు కూడా అధిక బరువుతో సమస్యలు ఎదుర్కోవల్సివస్తోంది. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి మాత్రమే ఇందుకు ప్రధాన కారణాలు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తుంటే..మీ కోసం కొన్ని సులభమైన చిట్కాలు..
స్థూలకాయం సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిమ్ లేదా వ్యాయామం చేయకుండానే కొన్ని సులభమైన పద్ధతులతో బరువు తగ్గించుకోవచ్చు. గంటల తరబడి జిమ్‌లో చెమట చిందించుకోకుండా నియమిత పద్ధతిలో ఈ ఐదు రకాల చిట్కాలు ఫాలో అయితే సులభంగానే బరువు నియంత్రిచుకోవచ్చు. ఎందుకంటే కేవలం జిమ్‌లో వర్కవుట్లు చేసినంత మాత్రాన బరువు తగ్గడం అనేది జరగదు. క్రమం తప్పకుండా నియమిత పద్ధతిలో జీవనశైలిని అందుకు అనుగుణంగా మార్చుకోవల్సి ఉంటుంది.
అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు పాటించమని సలహా ఇస్తున్నారు. రోజూ కనీసం 20 నిమిషాలు వాకింగ్ తప్పకుండా చేయాలి. మద్యాహ్నం, రాత్రి భోజనం తరువాత తప్పకుండా కాస్సేపు లైట్ వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమౌతుంది. శరీరం ఫిట్‌గా ఉంటుంది.
రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూనే డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా స్వీట్స్ లేదా పంచదారకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే ఫ్యాట్ కరుగుతుంది. స్థూలకాయం తగ్గడంతో పాటు బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు ముప్పు తగ్గిపోతుంది.
రోజూ క్రమం తప్పకుండా ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. దీంతోపాటు భోజనానికి అరగంట ముందు తరువాత కూడా గోరు వెచ్చని నీళ్లు తాగుతుండాలి. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. ఎందుకంటే మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్లనే అదిక బరువు సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
ఇక శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచడం చాలా అవసరం. దీనికోసం తినే ఆహారంలో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఫైబర్ కోసం యాపిల్, దానిమ్మ, జామ, అరటి, బీన్స్ వంటివి డైట్‌లో భాగం చేసుకోవాలి. రోజుకు రెండు అరటి పండ్లు తింటే కడుపు వ్యవస్థ మెరుగుపడుతుంది.
ఆరోగ్యం హెల్తీగా ఫిట్‌గా ఉండాలంటే రోజుకు కనీసం 7-8 గంటల రాత్రి నిద్ర తప్పకుండా ఉండాలంటున్నారు వైద్యులు. దీనివల్ల శరీరంలోని కండరాలకు పూర్తిగా విశ్రాంతి లబిస్తుంది. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. రోజూ మంచి నిద్ర ఉంటే స్థూలకాయం సమస్య ఉత్పన్నం కాదు.
Also read: Periods Problem: పీరియడ్స్ సమస్యకు చెక్. సహజసిద్ధంగా ఇలా వాయిదా వేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook