Weight Loss Diet: ఆధునిక జీవన శలికారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడం వల్ల చాలా మందిలో గుండె పోటు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే బరువును నియంత్రించడానికి చాలా ఔషధాలు ఉన్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. అయితే బరువు తగ్గడానికి యోగా, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. చాలా మంది కఠిన వ్యాయామాలు చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంతేకాకుండా బరువు కూడా తగ్గలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి డైట్‌ను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డైట్లైను అను సరించడం వల్ల ఎలా బరువు తగ్గుతారో మనం తెలుసుకుందాం..
ఇలా డైట్‌ను అనుసరించండి:
<<లంచ్, డిన్నర్ లో పచ్చి కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడమేకాకుండా.. సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటిన్లు ఉంటాయి.
<<అల్పాహారంలో భాగంగా పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదే క్రమంలో ఉడికించిన ఆకుపచ్చ కూరగాయలను తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు.
<<వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే కొవ్వులు చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
<<బ్లూ బెర్రీస్ తినడం వల్ల కూడా బరువును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది.
<< విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్, ఇతర యాంటీఆక్సిడెంట్ల బ్లూ బెర్రీస్‌లో లభిస్తాయి. అంతేకాకుండా ఇవి సులభంగా బరువును నియంత్రించడానికి కృషిస్తాయి.
<<ఓట్స్ కూడా బరువు పెరగకుండా, పెరుగుతున్న బరువును సులభంగా నియంత్రిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకుంటే.. బరువు సులభంగా తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook