Dear Krishna: పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం 'డియర్ కృష్ణ'. ఈ చిత్రం ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. దినేష్ బాబు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక అద్భుతాన్ని ప్రేరణగా తీసుకొని, నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ' 'ప్రేమలు' చిత్రం ఫేమ్ మమిత బైజు కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో, లక్ష రూపాయల కాంటెస్ట్ తో ఆడియన్స్ ను దృష్టిని ఆకర్షించిన 'డియర్ కృష్ణ'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో శ్రీ కృష్ణుడిని ముఖ్య అతిథిగా భావిస్తూ, భగవంతుడి కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీని ఏర్పాటు చేయడం విశేషం.
రచయిత, నిర్మాత పి.ఎన్. బలరామ్ మాట్లాడుతూ.. "నేను ఈ చిత్రానికి నిర్మాతగా భావించడం లేదు. కృష్ణుడి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న వ్యక్తిగా భావిస్తున్నాను. మా ఫ్యామిలీ శ్రీ కృష్ణుడిని ఎంతగానో పూజిస్తాము. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నాము. కృష్ణుడి వల్ల మా కుటుంబంలో జరిగిన ఒక అద్భుతాన్నేస్టోరీగా తీసుకొని, డియర్ కృష్ణ సినిమాని తెరకెక్కించాము. మా కుమారుడు అక్షయ్ అత్యంత అరుదైన వ్యాది నుంచి, డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ చిత్రంలో అక్షయ్ నే హీరోగా నటించాడు. ఈ చిత్రం కోసం మేము స్టార్స్ ని తీసుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్. మమ్మల్ని, మా సినిమాని కృష్ణుడే నడిపిస్తారని చెప్పుకొచ్చారు.
హీరోగా అక్షయ్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో జరిగిన ఒక మిరాకిల్ ను ప్రేరణగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. నేను హీరోగా నటించాను. మా ఫ్యామిలీకి, కృష్ణుడికి మధ్య నడిచే ప్రేమ కథే ఈ మూవీ. మా నాన్న నాకు జన్మని ఇవ్వడమే కాదు, పునర్జన్మను కూడా ఇచ్చారు. ఆయన వల్లే నేను ఈరోజు ఇలా మీ ముందునున్నాను. విజయ్ గారి 69 వ సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల మమిత ఈ ప్రెస్ మీట్ కి రాలేకపోయింది. త్వరలో జరిగే ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఆమె పాల్గొంటుందన్నారు.
కథానాయిక ఐశ్వర్య మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ ఇచ్చే ఇచ్చిన దర్శకుడు దినేష్ బాబుకి, నిర్మాత బలరామ్ కి కృతజ్ఞతలు. అక్షయ్, మమిత, లోహిత్ వంటి ఎంతో ప్రతిభగల నటీనటులు ఉన్న ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు.
సీనియర్ నటుడు లోహిత్ మాట్లాడుతూ, ఇది అద్భుతమైన ప్రేమ కథ. అయితే అన్ని ప్రేమ కథల లాంటిది ఈ మూవీ కాదిది. ఒక కుటుంబం కృష్ణుడిని ప్రేమించడం వలన వచ్చిన కథ. ఇలాంటి రియలిస్టిక్ స్టోరీని సినిమాగా తీసుకొస్తున్న బలరామ్ కి ధన్యవాదాలు.
హరి ప్రసాద్ మ్యూజిక అందిస్తూన్న ‘డియర్ కృష్ణ’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దినేష్ బాబు, ఎడిటర్ గా రాజీవ్ రామచంద్రన్ వ్యవహరిస్తున్నారు. లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఈ సినిమా లోనిదే కావడం విశేషం. ‘చిరుప్రాయం' అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.